తమ్ముడిని చంపి మర్మాంగం తినేసిన అక్క !

తోడబుట్టిన తమ్ముడిని అతి కిరాతకంగా హత్య చేసి.. ఆ తర్వాత అతని మర్మాంగాన్ని కోసం తినేసింది ఓ 18ఏళ్ల అతని సోదరి. ఈ అతి దారుణ సంఘటన బ్రెజిల్ లో చోటుచేసుకుంది. పోలీసులు చెబుతున్న వివరాల ప్రకారం బ్రెజిల్ లో నివసిస్తున్న దంపతులకు 18ఏళ్ల కుమార్తె, ఐదేళ్ల కొడుకు ఉన్నారు. కాగా ఇటీవల తల్లి మార్కెట్‌కు వెళ్తూ తన ఐదేళ్ల పిల్లోడిని 18 ఏళ్ల కూతురు కరీనాకు అప్పగించింది. కాగా ఇంట్లో ఎవరూ లేని సమయాన్ని అదునుగా చేసుకున్న కరీనా తమ్ముడిని చంపేందుకు ప్లాన్ చేసింది. గేమ్ ఆడదాం అని మాయమాటలు చెప్పి.. తమ్ముడిని తన గదిలోకి తీసుకెళ్లి దిండుతో ఊపిరాడకుండా చేసి చంపేసింది. అనంతరం అతని మర్మాంగాన్ని కోసి తినేసింది. దీని వెనుక ఏదైనా క్షుద్ర పూజలు లాంటివి ఉన్నాయేమో అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. అతని శరీర చిద్రమయిన స్థితిలో కనపడిందట. ఆమె తన సెల్‌ఫోన్, మెమొరికార్డును తగలబెట్టినట్టు పోలీసులు చెబుతున్నారు. ఇంట్లో డ్రగ్స్ కూడా దొరికాయని.. అనుమానంగా కనిపించిన వస్తువులను ఫారెన్సిక్ ల్యాబ్‌కు పంపించినట్టు పోలీసులు చెప్పారు. డ్రగ్స్ మత్తులోనే యువతి ఇలా చేసిందా అనే అనుమానం వ్యక్తం చేస్తున్నారు.