అల్లరి చేస్తున్నారని నగ్నంగా నుంచో పెట్టి…

గురు బ్రహ్మ అంటూ గురువుకు దేవుడికి ఇచ్చిన గౌరవం ఇచ్చారు పెద్దలు కానీ ఈ గురు వృత్తి, రోజురోజుకీ అపహాస్యమవుతోంది. కొన్నిరోజుల కిందట విద్యార్థులతో శృంగారం చేస్తూ కొందరు టీచర్లు దొరకడం సంచలనం సృష్టించగా తాజాగా ఓ టీచర్, అల్లరి చేస్తున్నారని చెప్పి విద్యార్థులను నగ్నంగా నిల్చోబెట్టి కలకలం రేపింది. పోనీ వీరందరూ ఏదో మహా ముదుర్లు ఏమో అనుకునేరు అందరూ అందరూ నాలుగేళ్ల, ఐదేళ్ల చిన్నారులే. సంచలనం రేపుతున్న్ ఈ సంఘటన అమెరికాలొనిఒ ఇల్లినాయిస్ ఏరియాలో జరిగింది. ఓ ప్రైమర స్కూల్‌లో టీచర్‌గా విధులు నిర్వహించిన ఓ మహిళ చిన్నపిల్లలను ఆడిస్తూ ఉండేది. అయితే ఇష్టం లేని ఉద్యోగం చేస్తున్న ఆమె, తన అసహనాన్ని పిల్లలపై చూపించేది. కోపంతో పిల్లల వీపులు వాయించేది. ఎంత చెప్పినా, వినకుండా అల్లరి చేస్తున్నారనే కోపంతో ఊగిపోయిన సదరు టీచర్ చిన్నారులను ఇష్టంవచ్చినట్టు కొట్టింది. అయినా ఆమె కోపం ఏ మాత్రం తగ్గకపోవడంతో పిల్లల బట్టలు విప్పించి, నగ్నంగా క్లాసు బయట నిల్చోబెట్టింది. ఉదయం నుంచి సాయంత్రం స్కూల్ అయిపోయేదాకా అలాగే ఉంచింది. ఉదయం నుంచి సాయంత్రం దాకా నగ్నంగా నిలబడిన చిన్నారులు ఇంటికి వెళ్లేసరికి నీరసంతో పడిపోయారు. ఏం జరిగిందని ఆరా తీయగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది. పెద్దల ఫిర్యాదుతో విషయం తెలుసుకున్న స్కూల్ యాజమాన్యం సదరు టీచర్‌ను, ఆమెకు సాయంగా ఉన్న అసిస్టెంట్‌ను సస్పెండ్ చేసింది.