ప్రభాస్ ఫ్యాన్స్​కు గుడ్ న్యూస్.. ‘సలార్‌’ రిలీజ్‌ డేట్‌ ఫిక్స్‌

ప్రభాస్ ఫ్యాన్స్​కు గుడ్ న్యూస్.. ‘సలార్‌’ రిలీజ్‌ డేట్‌ ఫిక్స్‌
Latest News

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ సినిమా అప్డేట్స్ కోసం చూసే ఫ్యాన్స్​కు ఎప్పుడూ నిరాశే ఎదురవుతుంది. అయినా సరే అభిమానులు ఆయన మీదున్న ప్రేమతో ఓపికగా ఎదురు చూస్తూ ఉంటున్నారు . అప్పుడప్పుడు అప్డేట్స్ లేట్ అవుతున్నాయని అర్థమైతే.. వాళ్లే ఫ్యాన్స్ ఎడిట్స్ చేసి మరి నెట్టింట పెడుతుంటారు . అలా ప్రభాస్ లేటెస్ట్ మూవీ సలార్​ విషయంలోనూ చేశారు. సలార్ చిత్రం ఎప్పుడెప్పుడు వస్తుందా అని ఎదురుచూస్తున్న ఫ్యాన్స్ రిలీజ్ డేట్ వాయిదా పడటంతో వాళ్లే ఓ రిలీజ్ డేట్​ను ఫిక్స్ చేసి నెట్టింట వైరల్ చేశారు.

ప్రభాస్ ఫ్యాన్స్​కు గుడ్ న్యూస్.. ‘సలార్‌’ రిలీజ్‌ డేట్‌ ఫిక్స్‌
Salaar Movie

అయితే ఇప్పుడు అదే నిజమైంది. ఫ్యాన్స్ వైరల్ చేసిన రిలీజ్ డేట్​నే అధికారికంగా ప్రకటించింది సలార్ టీమ్. డిసెంబర్‌ 22న ఈ సినిమా విడుదల కానున్నట్లు తెలుపుతూ ట్వీట్‌ చేసింది. దీంతో ప్రభాస్‌ అభిమానులంతా సంబరపడుతున్నారు. మొదట ఈ మూవీ ను సెప్టెంబర్‌ 28న విడుదల చేయాలని భావించినా కొన్ని కారణాల వల్ల రిలీజ్‌ను వాయిదా వేస్తున్నట్లు ప్రకటించడంతో ఫ్యాన్స్ మళ్ళి నిరాశపడ్డారు . తాజాగా డిసెంబర్‌ 22న రానుందని తెలుపుతూ వారిలో మరోసారి ఉత్సాహాన్ని నింపేసింది ‘సలార్‌’ టీమ్‌. ప్రశాంత్ నీల్‌ దర్శకత్వంలో శ్రుతి హాసన్ కథానాయికగా ఈ మూవీ రాబోతోంది.