ఓటీటీలోకి వచ్చేసిన ‘స‌ప్త సాగ‌రాలు దాటి’ మూవీ.. స్ట్రీమింగ్ దేంట్లో అంటే ..?

ఓటీటీలోకి వచ్చేసిన ‘స‌ప్త సాగ‌రాలు దాటి’ మూవీ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..?
Movie News

కేజీయఫ్ సినిమా సృష్టించిన సంచలనం తర్వాత భారతీయ మూవీ ఇండస్ట్రీ చూపు కన్నడ వైపు పడింది. ఇక అప్పటి నుంచి అక్కడ విడుదలవుతున్న చిన్న చిత్రాలైనా సరే.. కంటెంట్ ఉంది.. ప్రేక్షకులు ఆదరిస్తారనుకుంటే అన్ని భాషల్లో విడుదల చేస్తున్నారు. అలా వచ్చిన కాంతార సినిమా ఎంతటి హిట్ సాధించిందో చెప్పనక్కర్లేదు. తెలుగు ప్రేక్షకులు కూడా కన్నడ సినిమాలపై మనసు పారేసుకుంటున్నారు. ఇది గ్రహించిన టాలీవుడ్, శాండల్​వుడ్ నిర్మాతలు అక్కడ హిట్ అయిన చిత్రాలను డబ్ చేసి తెలుగులో వదులుతున్నారు. అలా తాజాగా రిలీజ్ అయిన మూవీ ‘స‌ప్త సాగ‌రాలు దాటి’.

ఓటీటీలోకి వచ్చేసిన ‘స‌ప్త సాగ‌రాలు దాటి’ మూవీ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..?
Sapta Sagaralu dati Movie

రక్షిత్ శెట్టి, రుక్మిణీ వసంత్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ మూవీ సెప్టెంబర్‌ 22న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇక ఇప్పుడు ఈ చిత్రం ఇప్పుడు సైలెంట్‌గా ఓటీటీలోకి వచ్చేసింది. ‘అమెజాన్‌ ప్రైమ్‌ వీడియో’ వేదికగా ప్రస్తుతం స్ట్రీమింగ్‌ అవుతోంది. తెలుగుతో పాటు కన్నడ, తమిళం, మలయాళం, హిందీలోనూ ఇది అందుబాటులోకి వచ్చిందని అమెజాన్ ప్రైమ్ వీడియో తన సోషల్ మీడియా ఖాతాలో వెల్లడించింది. హేమంత్ ఎం రావు దర్శకత్వం వహించిన ఈ సినిమా లో.. ప‌విత్ర లోకేశ్‌, అవినాష్‌, అచ్యుత్ కుమార్‌లు కీలక పాత్రల్లో కనిపించారు.