తెలంగాణ మహిళలకు శుభవార్త.. మహాలక్ష్మీ ప్రీ బస్ స్కీమ్ ప్రారంభం

Good news for Telangana women.. Mahalakshmi Pre Bus Scheme launched
Good news for Telangana women.. Mahalakshmi Pre Bus Scheme launched

తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ఇవాళ నిర్వహించారు. ప్రొటెమ్ స్పీకర్ అక్బరుద్దీన్ ఓవైసీ ఎమ్మెల్యేలతో ప్రమాణ స్వీకారం చేయించారు. అనంతరం 6 గ్యారెంటీలలో భాగంగా రెండు స్కీమ్ లను సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడారు. డిసెంబర్ 09వ తేదీకి తెలంగాణకు చాలా ప్రాముఖ్యత ఉంది. డిసెంబర్ 09, 2009న మన్మోహన్ సింగ్ ప్రధానిగా ఉన్న సమయంలో కేంద్ర హోంమంత్రి చిదంబరం తెలంగాణ రాష్ట్రాన్ని ఇస్తున్నట్టు ప్రకటన చేశారు.

ఈ విషయాన్ని ఇవాళ 2 గ్యారెంటీల ప్రారంభోత్సవంలో సీఎం రేవంత్ రెడ్డి గుర్తు చేశారు. మహాలక్ష్మీ పథకంలో భాగంగా ప్రీ టికెట్స్ విడుదల చేశారు. మహిళా మంత్రులు సీతక్క, కొండా సురేఖ జెండా ఊపి ప్రారంభించారు. బస్సులో సీఎం, డిప్యూటీ సీఎం, మంత్రులు, పలువురు ఎమ్మెల్యేలు ప్రయాణించారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు బస్సులో ట్యాంక్ బండ్ వద్దకు వెళ్లి అక్కడ అంబేద్కర్ విగ్రహానికి నివాళులర్పించి.. తిరిగి అసెంబ్లీ వద్దకు చేరుకున్నారు.