క్రీడల కోసం జగన్ ప్రభుత్వం కీలక నిర్ణయం..!

Jagan government's key decision for sports..!
Jagan government's key decision for sports..!

క్రీడల కోసం జగన్ సర్కార్ వినూత్న ఇనీషియేటివ్ చేసింది. క్రీడాకారుల కోసం టాలెంట్ సెర్చ్ నిర్వహిస్తోంది. ముఖ్యంగా ఆడుదాం ఆంధ్రాలో భాగంగా పలు సంస్థలతో ఒప్పందాలు కుదుర్చుకుంది. యువతలో క్రీడలను ప్రోత్సహించే విధంగా ఒప్పందాలు చేసుకున్నారు. 9 సంస్థలతో ఒప్పందాలు చేసుకున్న ఏపీ ప్రభుత్వం.మరో రెండు సంస్థలతో చర్చలు కొనసాగుతున్నాయి.

ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్, చెన్నై సూపర్ కింగ్స్, ప్రో కడ్డీ లీగ్, ప్రైమ్ వాలీబాల్ లీగ్, ఏపీ బ్యాడ్మెంట్ అసోసియేషన్ తో ఒప్పందం చేసుకున్నారు. ముఖ్యంగా పీవీ సింధు, ఆంధ్రా ఖో ఖో అసోసియేషన్, ఆంధ్రా కబడ్డీ అసోసియేషన్, ఆంధ్రా వాలీబాల్ అసోసియేషన్ తో ఒప్పందాలు జరిగాయి. ఈ సంస్థల నేతృత్వంలో రాష్ట్ర వ్యాప్తంగా టాలెంట్ సెర్స్.. సన్ రైజర్స్ హైదరాబాద్, ముంబాయి ఇండియన్స్ తో చర్చలు జరిగాయి. రాబోయే ఐపీఎల్, పీకేఎల్, పీవీఎల్ సీజన్స్ లలో ఏపీ క్రీడాకారులకు అవకాశాలు వచ్చే ఛాన్స్ కనిపిస్తోంది. ఏం జరుగుతుందనేది వేచి చూడాలి మరీ.