గుడ్ న్యూస్ :‘సలార్ -2’ షూటింగ్ అప్పటినుంచే ?

గుడ్ న్యూస్ :‘సలార్ -2’ షూటింగ్ అప్పటినుంచే ?
Cinema News

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కిన బ్లాక్ బస్టర్ యాక్షన్ మూవీ సలార్’. ఈ మూవీ కలెక్షన్ల సునామీని సృష్టించి అద్భుత విజయాన్ని సాధించింది. దీంతో, సలార్-2 పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో సలార్-2 పై ఒక రూమర్ వినిపిస్తోంది. నవంబర్ నుంచి షూటింగ్ స్టార్ట్ చేసి.. 2025 దసరాకి మూవీ ని రిలీజ్ చేస్తారని తెలుస్తోంది.

గుడ్ న్యూస్ :‘సలార్ -2’ షూటింగ్ అప్పటినుంచే ?
Salaar – 2 Movie

ఆ మధ్య సలార్ 2 మూవీ నిర్మాత విజయ్‌ కిరగందూర్‌ కూడా మాట్లాడుతూ.. ‘నవంబర్ నుంచి ఈ మూవీ పార్ట్-2ని పూర్తి చేసి.. 2025లో రిలీజ్‌ చేస్తామన్నారు. కాగా, పార్ట్-2 మూవీ ‘గేమ్‌ ఆఫ్‌ థ్రోన్స్‌’లా ఉండనుందని ఆయన తెలిపారు. అన్నట్టు సలార్ పార్ట్ 1 మూవీ రికార్డు స్థాయి వసూళ్లను సాధించింది. కాగా, ఈ మూవీ వరల్డ్ వైడ్‌గా కేవలం రెండు వారాల్లోనే రూ.659.69 కోట్ల గ్రాస్ వసూళ్లు రాబట్టింది.