పదవీ విరమణ వయసు పెంచుతున్న సింగరేణి

పదవీ విరమణ వయసు పెంచుతున్న సింగరేణి

ఉద్యోగుల పదవీ విరమణ వయసు పెంచుతూ తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి సింగరేణి బోర్డు ఆమోదం తెలిపింది. ఈ సందర్భంగా సింగరేణి ఉద్యోగుల పదవీ విరమణ వయసు 61 ఏళ్లకు పెరగనుంది. సోమవారం భేటీ అయిన సింగరేణి బోర్డు పలు కీలక నిర్ణయాలు తీసుకుంది.

అందులో భాగంగా ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు ఉద్యోగాల్లో 10 శాతం రిజర్వేషన్ అమలు చేయాలని నిర్ణయించింది. 2021-22 ఏడాదికి సీఎస్‌ఆర్ ఫండ్‌ కోసం రూ.61 కోట్లు కేటాయించింది. ఇక సింగరేణి నిర్వాసిత కాలనీలకు సంబంధించి 201 ప్లాట్ల కేటాయించాలని సింగరేణి బోర్డు నిర్ణయం తీసుకుంది.