గుడ్ న్యూస్ :“పుష్ప 2” టీజర్ ఎలా ఉంటుందంటే ..?

What is the teaser of
What is the teaser of "Pushpa 2"?

ప్రస్తుతం పాన్ ఇండియా ఆడియెన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న భారీ మూవీ “పుష్ప 2 ది రూల్” (Pushpa 2 The Rule) కోసం అందరికి తెలిసిందే. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun) హీరోగా నేషనల్ క్రష్ రష్మికా మందన్నా (Rashmika Mandanna) హీరోయిన్ గా దర్శకుడు సుకుమార్ తెరకెక్కిస్తున్న ఈ మూవీ పుష్ప 1 కంటే ఎంతో గ్రాండ్ గా భారీగా ప్లాన్ చేస్తున్నారు.

ఇక అల్లు అర్జున్ బర్త్ డే వస్తుండడంతో మేకర్ ఆల్రెడీ సాలిడ్ టీజర్ (Pushpa 2 Teaser) కట్ ను రిలీజ్ చేస్తున్నట్టుగా కన్ఫర్మ్ చేశారు. మరి ఈ టీజర్ కోసం అందరిలో మంచి అంచనాలను నెలకొన్నాయి. అయితే ఈ టీజర్ పై కొన్ని ఆసక్తికర అంశాలు కూడా వినిపిస్తున్నాయి. ఈ టీజర్ లో పుష్ప పాత్ర ఎలా ఎదిగింది అనే అంశానికి సంబంధించి క్రేజీ సీక్వెన్స్ లు కనిపిస్తాయని తెలుస్తుంది.

What is the teaser of "Pushpa 2"?
What is the teaser of “Pushpa 2”?

అంతే కాకుండా పార్ట్ 1 టీజర్ ఎండింగ్ లో ‘తగ్గేదేలే’ అనే డైలాగ్ ఉన్నట్టుగా ఈసారి టీజర్ అది లేదా దాని కంటే అప్డేటెడ్ వెర్షన్ డైలాగ్ ఉండొచ్చని టాక్. మొత్తానికి అయితే ఒక పవర్ఫుల్ హై మూమెంట్స్ తో ఈ టీజర్ రాబోతోంది అని చెప్పాలి. మరి ఈ టీజర్ కట్ ఇలానే ఉంటుందా లేదా అని ఈ ఏప్రిల్ 8వరకు ఆగితే తెలిసిపోతుంది. ఇక ఈ మాసివ్ ప్రాజెక్ట్ కు దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తుండగా సుకుమార్ రైటింగ్స్, మైత్రి మూవీ మేకర్స్ వారు నిర్మాణం వహిస్తున్నారు.