Election Updates: ఇవాళ తూర్పుగోదావరి జిల్లాలో టిడిపి అధినేత చంద్రబాబు పర్యటన

Election Updates: TDP chief Chandrababu's visit to East Godavari district today
Election Updates: TDP chief Chandrababu's visit to East Godavari district today

ఏపీ అసెంబ్లీ, పార్లమెట్‌ ఎన్నికల నేపథ్యంలో టిడిపి అధినేత చంద్రబాబు అన్ని నియోజక వర్గాల్లో పర్యటిస్తున్నారు. ఇక ఇవాళ తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరు నియోజకవర్గంలో టిడిపి అధినేత పర్యటన కొనసాగనుంది. ఈ మేరకు ఇవాళ మధ్యాహ్నం మూడు గంటలకు టిడిపి అధినేత చంద్రబాబు కొవ్వూరు చేరుకోనున్నారు.

చాగల్లు రోడ్డు నుండి విజయ విహార్ సెంటర్ వరకు రోడ్ షోలో పాల్గొంటారు టిడిపి అధినేత చంద్రబాబు. అనంతరం ప్రజాగళం సభలో చంద్రబాబు ప్రసంగం ఉంటుంది. ఈ సభ అనంతరం గోపాలపురం పర్యటనకు వెళ్లనున్నారు చంద్రబాబు. అటు అనపర్తి మాజీ ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డికి చంద్రబాబు నుంచి పిలుపు వచ్చింది.

నేడు రామచంద్రపురంలో చంద్రబాబును కలవనున్నారు రామకృష్ణారెడ్డి. అనపర్తి పంచాయతీకి పుల్ స్టాప్ పెట్టే ప్రయత్నంలో చంద్రబాబు ఉన్నారు. పొత్తు లో అనపర్తి సీటు బిజెపికి కేటాయించారు. ఇక అప్పటి నుంచి నిరసన వ్యక్తం చేస్తున్నారు అనపర్తి మాజీ ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి.