గవర్నర్ నరసింహన్‌కు అస్వస్థత 

governor-narasimhan-is-sick

తెలంగాణ గవర్నర్ నరసింహన్ ఈఎస్ఎల్ నరసింహన్‌కు స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. సతీమణి విమలతో కలిసి బిహార్‌‌లోని బుద్ధగయ పర్యటనలో ఉన్న ఆయన సోమవారం అనారోగ్యానికి గురయ్యారు.

ఒక్కసారిగా వాంతుల చేసుకోవడంతో అధికారులు ఆయన్ని హుటాహుటిన సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో గవర్నర్‌కు ప్రాథమిక చికిత్స అందించిన డాక్టర్లు అనంతరం రక్తపరీక్ష, ఈసీజీ వంటి పరీక్షలు నిర్వహించారు.

నివేదికలు పరిశీలించిన తర్వాత ఆయన ఎలాంటి సమస్యా లేదని తేల్చారు. దీంతో నరసింహన్ అక్కడి నుంచి సతీమణితో కలిసి దేశ రాజధాని ఢిల్లీకి బయలుదేరి వెళ్లారు.

రేపు ఢిల్లీలో పర్యటించనున్న నరసింహన్ మధ్యాహ్నం 12 గంటల సమయంలో రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌తో భేటీ కానున్నారు. త్వరలో జరగబోయే గవర్నర్ల సదస్సు గురించి ఆయనతో చర్చించనున్నారు. అనంతరం హైదరాబాద్ తిరుగు పయనమవుతారు.