హీరో తరుణ్‌కు రోడ్డు ప్రమాదం…అనుమానాలు !

road-accident-to-hero-tarun-suspicions

ఒకప్పటి లవర్ బోయ్, ప్రముఖ నటుడు తరుణ్ కు తృటిలో ప్రమాదం తప్పింది. ఓటర్‌ రింగ్‌ రోడ్‌ నార్సింగ్‌ సమీపంలోని అల్కాపూర్‌ దగ్గర తరుణ ప్రయాణిస్తున్న కారు అదుపు తప్పి డివైడర్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో తరుణ్‌కు ఎలాంటి గాయాలూ కాలేదు.

ప్రమాదం తరువాత వేరే కారులో వెళ్లిపోయాడని స్థానికులు చెప్తున్నారని ప్రచారం జరుగుతోంది. అయితే  కారు అసలు తరుణ్‌ది కాదని తేలింది. ఈ కారు ప్రమాదంపై నార్సింగి పోలీసులు విచారణ చేపట్టారు.

ప్రమాదానికి గరైన కారు లీడ్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ పేరుతో రిజిస్టర్ అయ్యి ఉందని చెప్పారు. కారులో హీరో తరుణ్ లేరని స్పష్టం చేశారు. ఆ కారు తరుణ్‌ది కాదని ఆయన తల్లి రోజా రమణి కూడా వెల్లడించారని తెలిపారు.

అయితే, యాక్సిడెంట్ సమయంలో ఓ ఇద్దరు వ్యక్తులు కారులో ఉన్నారని పోలీసులు చెబుతున్నారు. కారు యజమాని ఎవరో తెలుసుకునేందుకు పోలీసులు ప్రయత్నం చేస్తున్నారు.