పెళ్లి వేడుక‌లో కాబోయే భార్య‌ వివాహేత‌ర బంధం వీడియో ప్ర‌ద‌ర్శ‌న‌…

Groom exposes his cheating bride video at their wedding guests

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 

కాబోయే భార్య‌ వివాహేత‌ర బంధంపై వ‌రుడి ఆగ్ర‌హం
పెళ్లి వేడుక‌లో వీడియో ప్ర‌ద‌ర్శ‌న‌

వివాహేత‌ర సంబంధాలు, పెళ్లికి ముందు ఎఫైర్లు పాశ్చాత్య దేశాల్లో కామ‌న్ అని మ‌నం అనుకుంటూ ఉంటాం. ఇలాంటి విష‌యాల‌ను వాళ్లు పెద్ద సీరియ‌స్ గా తీసుకోరు అనుకుంటాం. కానీ వాళ్లు కూడా వివాహేత‌ర సంబంధాల‌ను లైట్ గా తీసుకోర‌ని నిరూపించిందో ఘ‌ట‌న‌. సాధార‌ణంగా మ‌న‌దేశంలో పెళ్లికి సిద్ద‌మ‌యిన యువ‌కుడు… త‌న‌కు కాబోయే భార్య వ్య‌వ‌హార శైలి గురించి అనుమానంగా ఉంటే పెద్ద‌వాళ్ల‌తో చ‌ర్చించి నిర్ణ‌యం తీసుకుంటాడు. ఒక‌వేళ నిజంగానే యువ‌తి ప్ర‌వ‌ర్త‌న స‌రైన‌ది కాద‌ని తేలితే… సైలెంట్ గా పెళ్లి క్యాన్సిల్ చేసుకుంటారు. అలాగే పెళ్లికూతురుకీ పెళ్లికొడుకు గ‌త జీవితం గురించి ఏమ‌న్నా విష‌యాలు తెలిస్తే… పెద్ద‌వాళ్లే విష‌యాన్ని చ‌క్క‌దిద్దుతారు. అంత‌టితో ఆ వ్య‌వ‌హారం ముగిసిపోతుంది.

ఎరేంజెడ్ మ్యారేజెస్ అనే కాదు… ప్రేమించుకుని పెళ్లిచేసుకోవ‌టానికి సిద్ధ‌మ‌యిన జంటల విష‌యంలోనూ ఇలాంటి వ్య‌వ‌హారాలు వెలుగుచూసినా… పెళ్లి క్యాన్సిల్ చేసుకోవ‌డం ద్వారానో, పెద్ద‌ల చేత చెప్పించ‌డం ద్వారానో వివాదానికి ముగింపు ప‌లుకుతారు. కానీ లండ‌న్ కు చెందిన ఓ యువ‌కుడు మాత్రం విభిన్నంగా రియాక్ట‌య్యాడు. ఓ ర‌కంగా చెప్పాలంటే క్రిమిన‌ల్ మైండ్ తో ఆలోచించి పెళ్లికుమార్తె ను న‌లుగురిలో న‌వ్వుల‌పాలు చేశాడు.

లండ‌న్ కు చెందిన ఆ యువ‌కుడు పెద్ద‌ల‌ను ఒప్పించి తాను ప్రేమించిన అమ్మాయితో వివాహానికి సిద్ధ‌మ‌య్యాడు. అయితే త‌న‌కు కాబోయే భార్య త‌న‌క‌న్నా ముందుగా మ‌రో వ్య‌క్తితో స‌న్నిహితంగా ఉంద‌ని, ఇప్ప‌టికీ ఆ సంబంధాన్ని కొన‌సాగిస్తోంద‌ని తెలుసుకున్న ఆ యువ‌కుడు ఆమెపై ప‌గ పెంచుకున్నాడు. యువ‌తి త‌న మాజీ ప్రియుడితో క‌లిసి హోట‌ల్ కు వెళ్ల‌డంతో పాటు వారిద్ద‌రూ అత్యంత చ‌నువుగా ఉన్న ఫుటేజీని సంపాదించాడు. స‌మ‌యం కోసం వేచిచూసిన ఆ యువ‌కుడు కాబోయే భార్య‌పై క‌క్ష తీర్చుకునేందుకు పెళ్లి వేడుకను వేదిక‌గా చేసుకున్నాడు. త‌మ ప్రేమపై ఓ వీడియో రూపొందించాన‌ని, ఇప్పుడు దాన్ని ప్లే చేస్తాన‌ని ప్ర‌క‌టించి వీడియో ఆన్ చేశాడు.

అంద‌రూ వారిద్ద‌రి ప్రేమ‌, స్నేహం గురించిన దృశ్యాలు వ‌స్తాయ‌ని భావిస్తోంటే… అందులో మాత్రం వ‌ధువు వేరే వ్య‌క్తితో క‌లిసి హోట‌ల్ కు వెళ్తున్న దృశ్యాలు, అత‌నితో సన్నిహితంగా ఉన్న దృశ్యాలు క‌నిపించాయి. ఈ ఘ‌ట‌న‌తో వ‌ధువుతో పాటు పెళ్లికి వ‌చ్చిన అతిథులంద‌రూ షాకయ్యారు. అవ‌మానం భ‌రించ‌లేక ఆ యువ‌తి వెడ్డింగ్ హాల్ నుంచి వెళ్లిపోయింది. మిర్ర‌ర్ డాట్ కో డాట్ యూకే లో వ‌చ్చిన ఈ క‌థ‌నం ప్ర‌పంచ వ్యాప్తంగా సంచ‌ల‌నం సృష్టిస్తోంది. ఈ వీడియో ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది. వ‌ధువు ప్ర‌వ‌ర్త‌న గురించి తెలిసిన వెంట‌నే వివాహాన్ని ర‌ద్దుచేసుకోకుండా… పెళ్లిపీట‌ల దాకా తీసుకువ‌చ్చి వ‌రుడు ఇలా చేయ‌డాన్ని నెటిజ‌న్లు త‌ప్పుబ‌డుతున్నారు.