‘జైలవకుశ’ డిస్ట్రిబ్యూటర్లు సేఫ్‌ అవ్వడానికి ఇంకా ఎంత కావాలి

Jai Lava Kusa Wants 4crs Collections To Be Distributors Safe Side

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 
యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌ మూడు విభిన్న పాత్రల్లో నటించిన ‘జైలవకుశ’ చిత్రం దసరా కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చినవిషయం తెల్సిందే. అదే దసరాకు విడుదలైన స్పైడర్‌ చిత్రం సక్సెస్‌ కాకపోవడంతో ఎన్టీఆర్‌ జైలవకుశకు కలిసి వచ్చింది. భారీస్థాయిలో జైలకుశ వసూళ్లు సాధించింది. మొదటి నుండి కూడా సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. దాంతోడిస్ట్రిబ్యూటర్లు ఏకంగా 80 కోట్లకు ఈ సినిమాను కొనుగోలు చేయడం జరిగింది. అన్ని ఏరియాలకు థియేట్రికల్‌ రైట్స్‌ ద్వారా నిర్మాతకు80 కోట్ల మేరకు ముట్టినట్లుగా తెలుస్తోంది. అయితే ఇప్పటి వరకు సినిమా 76 కోట్లు వసూళ్లు చేసింది.

డిస్ట్రిబ్యూటర్లు పూర్తిగా సేఫ్‌ అవ్వాలి అంటే మరో నాలుగు కోట్లు కలెక్ట్‌ చేస్తే చాలు. ఇప్పటికే కొన్ని ఏరియాల్లో డిస్ట్రిబ్యూటర్లు లాభాల బాట పట్టారు. ఒకటి రెండు చోట్ల మాత్రమే డిస్ట్రిబ్యూటర్లు ఇంకా లాస్‌లో ఉన్నారు. మరో వారం రోజుల పాటు పెద్ద సినిమాలు ఏమీ లేవు కనుక, ఖచ్చితంగా మంచి కలెక్షన్స్‌ వచ్చే అవకాశం ఉంది. వచ్చే వారంతం వరకు ఖచ్చితంగా జైలవకుశ పూర్తిగా సేఫ్‌ ప్రాజెక్ట్‌గా మారబోతుందని అంటున్నారు. ఎన్టీఆర్‌ కెరీర్‌లోనే అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా ఇప్పటికే ఈ సినిమా రికార్డు సాదించింది.

దాదాపు 140 కోట్ల గ్రాస్‌ కలెక్షన్స్‌ను వసూళ్లు చేసిన ఈ సినిమా 150 కోట్ల దిశగా అడుగులు వేస్తోంది. భారీ స్థాయిలో అంచనాలున్న ఈ సినిమాలో ఎన్టీఆర్‌కు జోడీగా రాశిఖన్నా మరియు నివేదా థామస్‌లు హీరోయిన్స్‌గా నటించారు. బాబీ దర్శకత్వంలో కళ్యాణ్‌ రామ్‌ ఈ చిత్రాన్ని నిర్మించాడు. ఈ చిత్రంతో కళ్యాణ్‌ రామ్‌కు భారీ లాభాలు దక్కాయి. దాదాపు 60 కోట్లకు పైగా కళ్యాణ్‌ రామ్‌ లాభాలు దక్కించుకున్నట్లుగా ట్రేడ్‌ వర్గాల్లో ప్రచారం జరుగుతుంది.