మ‌నిషి రూపం వేరు..నిజస్వ‌రూపం వేరు- గుణ 369 ట్రైల‌ర్

guna 369 trailer released

ఆర్ ఎక్స్ 100 ఫేమ్ కార్తికేయ న‌టిస్తున్న తాజా చిత్రం గుణ 369. అర్జున్ జంధ్యాల ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న ఈ చిత్రంలో అన‌గ క‌థానాయిక‌గా న‌టిస్తుంది. ఆగ‌స్ట్ 2న విడుద‌ల కానున్న ఈ చిత్రానికి సంబంధించి తాజాగా ట్రైల‌ర్ విడుద‌ల చేశారు. ఇందులో ల‌వ్‌, యాక్ష‌న్, ఎమోష‌న్స్ సీన్స్ సినిమాపై ఆస‌క్తిని క‌లిగిస్తున్నాయి. మ‌నిషి రూపం వేరు..నిజస్వ‌రూపం వేరు అని కార్తికేయ చెప్పిన డైలాగ్ ఆక‌ట్టుకుంటుంది. ఈ చిత్రాన్ని తిరుమ‌ల రెడ్డి, అనీల్ క‌డియాలా సంయుక్తంగా నిర్మిస్తున్నారు. చింత‌న్ భ‌ర‌ద్వాజ్ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. రామ్ రెడ్డి సినిమాటోగ్రాఫ‌ర్‌గా పని చేస్తున్నారు. ర‌స్టిక్ ల‌వ్ స్టోరీగా ఉండ‌నున్న ఈ చిత్రం ప్రేక్ష‌కుల‌ని త‌ప్ప‌క అల‌రిస్తుంద‌ని చెబుతున్నారు. మెగా ప్రొడ్యూస‌ర్ అల్లు అర‌వింద్, బ్లాక్ బ‌స్ట‌ర్ డైరెక్ట‌ర్ బోయ‌పాటి శీను చేతుల మీదుగా విడుద‌లైన ట్రైలర్‌పై మీరు ఓ లుక్కేయండి.