జగన్ పాదయాత్ర వల్ల మూడు నెలలు పని పోయిందన్న జబర్దస్త్ నటుడు

jabardasth actor respond on participating in jagan march

గత ఎన్నికల ముందు జరిగిన జగన్ పాదయాత్రకు కేవలం రాజకీయ రంగానికి చెందినవారే కాక ఇతర రంగాలకు చెందినవారు కూడా తమ మద్ధతును తెలియజేశారు. సినీ పరిశ్రమకు చెందిన చాలా మంది స్వయంగా జగన్‌తో పాటు పాదయాత్రలో పాల్గొన్నారు. ఇక ‘జబర్దస్త్’ కామెడీ షోతో పాపులరైన శాంతి స్వరూప్, వినోద్ కూడా జగన్‌తో నడిచారు. అయితే, జగన్ పాదయాత్రలో పాల్గొనడం కారణంగా శాంతి స్వరూప్, వినో‌ద్‌లను ‘జబర్దస్త్’ నుంచి తొలగించారని అప్పట్లో వార్తలు వచ్చాయి. ఈ ఆరోపణలపై తాజాగా శాంతి స్వరూప్ స్పందించారు. తాము జగన్ పాదయాత్రకు వెళ్లి తప్పుచేశామని అన్నారు. సంబంధం లేదు. మేం అపుడు జబర్దస్త్ షో కి డుమ్మా కొట్టి వెళ్లాం. మాకు జబర్దస్త్ లైఫ్ ఇచ్చినపుడు మేం దానికి ప్రాధాన్యత ఇవ్వాలి. అప్పుడు తెలియనితనంతో నేను, వినోద్ వాళ్లు పిలిచారు కదా అని వెళ్లిపోయాం. మేం వెళుతున్న విషయం టీమ్ లీడర్లకు చెప్పాం. కానీ, వారు మేనేజ్ చేయలేకపోయారు. మా పాత్రలు భర్తీ చేయడానికి అక్కడ ఎవ్వరూ లేరు. దీంతో ఇంకొకరు ఇలా చేయకూడదు అని మాపై మూడు నెలల నిషేదం విధించారు. మమ్మల్ని నమ్ముకుని స్కిట్లు రాసుకున్నపుడు, ఇలా వదిలేసి వెళ్లడం తప్పని మేం తెలుసుకునేలా చేశారు’ అని శాంతి స్వరూప్ చెప్పుకొచ్చారు.