బాలయ్య అభ్యర్ధికి కీలక పదవి కట్టబెట్టనున్న జగన్ !

jagan giving key position to iqbal

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. హిందూపురంలో బాలయ్య చేతిలో ఓడిన మాజీ ఐపీఎస్ అధికారి ఇక్బాల్‌ కి కీలక పదవి కట్టబెట్టబోతున్నారు. రాష్ట్ర హోంశాఖ మంత్రి మేకపాటి సుచరితకి సలహాదారులు ఇక్బాల్‌ను నియమించాలని జగన్ నిర్ణయం తీసుకున్నారని సమాచారం. త్వరలోనే దీనికి సంబంధించి ఉత్తర్వులు రాబోతున్నాయని అంటున్నారు. రాష్ట్ర ప్రజల శాంతిభద్రతకు సంబంధించి హోంశాఖ కీలకం కావడంతో.. ప్రత్యేకంగా సలహాదారును నియమించినట్లు తెలుస్తోంది. ఇక్బాల్‌కు సలహాదారు పదవి ఇవ్వడంతో.. గతంలో ఆయనకు జగన్‌కు ఇచ్చిన హామీ మాటేంటనే ప్రశ్నతెరపైకి వచ్చింది. రంజాన్ సందర్భంగా.. గుంటూరులోని పరేడ్ గ్రౌండ్స్‌లో ఏపీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందులో పాల్గొన్న సీఎం జగన్ ఇక్బాల్‌ను ఎమ్మెల్సీ చేస్తామని హామీ ఇచ్చారు. ఇప్పుడు ఇక్బాల్‌కు సలహాదారు పదవి ఇవ్వడంతో ఎమ్మెల్సీగా అవకాశం ఇస్తారా లేదా అన్నది ఆసక్తిగా మారింది. ఇక్బాల్ గతంలో ఐజీగా పని చేశారు ఎన్నికలకు కొద్ది నెలల ముందు టీడీపీ నుంచి వైఎస్ఆర్సీపీలో చేరారు. ఆయన్ను అనంతపురం జిల్లా హిందూపురం నియోజకవర్గానికి ఇంచార్జ్‌గా నియమించిన జగన్ ఎన్నికల్లో సీటు కేటాయించారు. కానీ టీడీపీ నుంచి పోటీచేసిన సినీ హీరో నందమూరి బాలయ్య చేతిలో ఓడిపోయారు.