సెక్స్ కోసం రెండు సార్లు కార్ తో గుద్దించి…ఆ తర్వాత గుహలో పడేసి….

punched with car twice for sex

ఉదయాన్నే జాగింగ్ కోసం బయటకు వెళ్లిన మహిళా సైంటిస్ట్ని కారుతో ఢీకొట్టి ఆ తర్వాత రేప్ చేసి గుహలో విసిరేసి దారునంగా హత్య చేశాడు ఒక ప్రభుద్దుడు. వివరాల్లోకి వెళ్తే అమెరికాకు చెందిన సుజానే ఈటన్(59) జర్మనీలోని‌ మాక్స్‌ ప్లాంక్‌ ఇన్‌స్టిట్యూట్‌ డ్రెస్డెన్‌ యూనివర్సిటీలో మాలిక్యులర్‌ బయోలజిస్టుగా పనిచేసేవారు. ఓ కాన్ఫరెన్స్‌లో పాల్గొనడం కోసం ఆమె గ్రీస్‌ వెళ్లారు. జూలై 2న క్రీట్ దీవిలో వాకింగ్‌కు వెళ్లిన ఆమె తిరిగి రాలేదు. సుజానే క్రీట్ రావడం అది నాలుగోసారి కావడంతో తిరిగొస్తుందనుకున్నారు. కానీ ఎంతకీ రాకపోవడంతో ఆమె స్నేహితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో ఆమె కోసం పోలీసులు తీవ్రంగా గాలించారు. సీసీటీవీ ఫుటేజీల సాయంతో అనుమానితుల్ని ప్రశ్నించారు. ఈ క్రమంలో 27 ఏళ్ల గ్రీస్ యువకుణ్ని అనుమానించిన పోలీసులు అతణ్ని తమదైన శైలిలో ప్రశ్నించగా నివ్వెరపోయే నిజాలు బయటపెట్టాడు. సెక్స్ కోసం తపించిన తాను ఆమెను రెండుసార్లు కారుతో ఢీకొట్టి ఆమెను అపహరించానని చెప్పాడు. ఈ క్రమంలో ఆమె పక్కటెముకలు విరిగిపోయి, ముఖం ఎముకలు చిట్లిపోయాయి, రెండు చేతులకు తీవ్ర గాయాలయ్యాయి. ఆ స్థితిలో ఉన్న ఆమెను రేప్ చేశానని ఆ తర్వాత రెండో ప్రపంచ యుద్ధ కాలంలో బంకర్‌గా వాడిన ఓ గుహలో పడేశాడని తెలిసింది. వెంటిలేషన్ విండో ద్వారా ఆమెను అందులోకి విసిరేసిన నిందితుడు తర్వాత దానికి చెక్క అడ్డుపెట్టి వెళ్లిపోయాడు. కార్లో ఆధారాలు లభ్యం కాకుండా జాగ్రత్త పడ్డాడు. అయితే గ్రీకు చట్టాల ప్రకారం నిందితుడి వివరాలు బహిర్గతం చేయకూడదు. అందుకే పోలీసులు అతడి పేరు వెల్లడించలేదు.