దారుణం…ఏడాదిగా వివాహిత మీద గ్యాంగ్ రేప్ !

Gang rape on married woman since one year

తమ కోరిక తీర్చకపోతే భర్తను చంపేస్తామని, మొహంపై యాసిడ్ పోస్తామని బెదిరిస్తూ నలుగురు కామాంధులు ఓ వివాహితపై ఏడాది కాలంగా అత్యాచారానికి పాల్పడుతున్న దారుణ ఘటన అనంతపురం జిల్లా రాయదుర్గంలో వెలుగులోకి వచ్చింది. ఏడాదిగా వారి కామవాంఛను తీరుస్తున్నా ఇంకా వేధింపులు ఎక్కువ కావడంతో చివరకు భర్తకు విషయం చెప్పి పోలీసులను ఆశ్రయించింది.  అనంతపురం జిల్లా రాయదుర్గంలో ఒక జంట నివిస్తున్నారు. భార్య రోజూ ఉదయం పాల ప్యాకెట్ కోసం ఓ దుకాణానికి వెళ్తుండేది. ఈ క్రమంలో దుకాణ యజమానితో మాటలు కలిసి పరిచయం ఏర్పడింది. ఆమె ఫేస్‌బుక్ వాడుతున్నట్లు తెలుసుకున్న దుకాణదారులు దాని ద్వారా ఆమె వ్యక్తిగత సమాచారం తెలుసుకుని మరింత దగ్గరయ్యాడు. దీంతో ఇద్దరూ ఫోన్ నంబర్లు ఇచ్చిపుచ్చుకుని చాట్ చేసుకునేవారు. కొద్దిరోజుల తర్వాత అతడిలో నిద్రలేచిన కామాంధుడు ఇద్దరి మధ్య జరిగిన తేడా ఛాటింగ్‌ను భర్తకు చూపిస్తానని  బెదిరించాడు. దీంతో భయపడిన వివాహిత భర్తకు చెప్పొద్దని వేడుకోగా తన కోరిక తీర్చాలని డిమాండ్ చేశాడు. అప్పటినుంచి ఇద్దరి మధ్య వివాహేతర సంబంధం కొనసాగుతోంది. ఈ విషయాన్ని తెలుసుకున్న దుకాణదారుడి ముగ్గురు స్నేహితులు కూడా ఆమెను వేధించసాగారు. తమ కోరిక తీర్చాలని బెదిరించి ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. వారి వేధింపులు తట్టుకోలేని బాధితురాలు తనను వదిలేయాలని వేడుకోగా నీ భర్తను చంపేస్తామని చెప్పి ఆమెపై అఘాయిత్యాన్ని కొనసాగిస్తూ వస్తున్నారు. ఓపిక నశించిన బాధితురాలు గత్యంతరం లేక ఈ విషయాన్ని భర్త చెప్పింది. దీంతో అతడు రాయదుర్గం పోలీస్‌స్టేషన్‌కు ఆమెను తీసుకెళ్లి ఫిర్యాదు చేశాడు.