తమన్నా కాదు హన్సిక.. ఇది మంచి నిర్ణయం

తెలుగులో హన్సిక స్టార్‌ హీరోయిన్‌గా గుర్తింపు దక్కించుకుంది. తెలుగులో ఈమె మంచి సినిమాలతో ప్రేక్షకులను అలరించింది. అయితే తమిళంలో మంచి అవకాశాలు రావడంతో అక్కడకు షిప్ట్‌ అయ్యింది. తమిళంలో సినిమాలు చేస్తూనే తెలుగులో కూడా అప్పుడప్పుడు సినిమాలు చేస్తూ వస్తోంది. తాజాగా తమిళం సినిమాలకే ఎక్కువ ఫోకస్‌ పెట్టిన ఈ అమ్మడు త్వరలో ఒక తెలుగు సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. అది మరేదో కాది తెలుగు వారు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న మూవీ ‘ఎన్టీఆర్‌’. అవును ఇప్పటికే ఈ చిత్రంలో ఎంతో మంది హీరోలు, హీరోయిన్స్‌ నటిస్తున్నట్లుగా చిత్ర యూనిట్‌ సభ్యుల నుండి అధికారికంగా ప్రకటన వచ్చింది. తాజాగా హన్సిక కూడా ఈ చిత్రంలో నటించబోతున్నట్లుగా సినీ వర్గాల ద్వారా సమాచారం అందుతోంది.

hansika

విశ్వసనీయ సమాచారం ప్రకారం ‘ఎన్టీఆర్‌’ మూవీలో జయప్రద పాత్రకు హన్సికను ఎంపిక చేసినట్లుగా తెలుస్తోంది. అయితే మొన్నటి వరకు ఈ పాత్రకు తమన్నాను ఎంపిక చేశారనే వార్తలు వచ్చాయి. కాని జయప్రద పాత్రకు తమన్నా ఏం బాగుంటుందనే అభిప్రాయం వ్యక్తం అయ్యింది. అందుకే తమన్నాను తొలగించి హన్సికను ఎంపిక చేసినట్లుగా తెలుస్తోంది. హన్సిక బొద్దుగా ఉండి అచ్చు జయప్రదలా ఉంటుందనే టాక్‌ వినిపిస్తుంది. హన్సిక నిర్ణయం సరైనది అంటూ సినీ వర్గాల వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఇక సహజ నటి జయసుధ పాత్రకు గాను ఆర్‌ఎక్స్‌100 బ్యూటీ పాయల్‌ రాజ్‌ పూత్‌ను ఎంపిక చేసినట్లుగా ఇప్పటికే వార్తలు వచ్చాయి. ఇక ఈ చిత్రంలో విద్యాబాలన్‌, నిత్యామీనన్‌, రకుల్‌ ప్రీత్‌ సింగ్‌, శ్రియ, పాయల్‌, హన్సిక ఇంకా పలువురు ముద్దుగుమ్మలు కనిపించబోతున్నారు. ఒకే సినిమాలో ఇంత మంది హీరోయిన్స్‌ అరుదైన విషయంగా చెప్పుకోవచ్చు.