యశ్ లేకుండా హనుమాన్ సీక్వెల్…!

యశ్ లేకుండా హనుమాన్ సీక్వెల్...!
Cinema News

టాలెంటెడ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో టాలీవుడ్ యంగ్ హీరో తేజ సజ్జ ప్రధాన పాత్రలో వచ్చిన మూవీ హనుమాన్ . అయితే ఈ మూవీ కు పార్ట్ 2 ఉంటుందని డైరెక్టర్ ప్రశాంత్ వర్మ ప్రకటించిన సంగతి తెలిసిందే. హనుమాన్ మూవీ సీక్వెల్గా రాబోతున్న ‘జై హనుమాన్’ లో కన్నడ హీరో యశ్ నటిస్తున్నట్లు ప్రచారం జరుగుతుంది . దీనిపై అతని మూవీ టీమ్ స్పందించింది. ఈ వార్తల్లో ఎలాంటి నిజం లేదని స్పష్టం చేసారు . ప్రస్తుతం ఆయన ‘టాక్సిక్-ఏ ఫెయిరీ టెయిల్ ఫర్ గ్రోన్ అప్స్’ మూవీ పనుల్లో బిజీగా ఉన్నారని పేర్కొంది.

యశ్ లేకుండా హనుమాన్ సీక్వెల్...!యశ్ లేకుండా హనుమాన్ సీక్వెల్...!
Hanuman sequel without Yash…!

సంక్రాంతి కానుకగా భారీ అంచనాల మధ్య జనవరి 12న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ మూవీ ఆడియన్స్ నుండి బ్లాక్ బస్టర్ టాక్ ని సొంతం చేసుకుంది. కేవలం రూ.75 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కించిన ఈ మూవీ రికార్డ్స్ క్రియేట్ చేసింది. ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ నుంచి వచ్చిన మొదటి మూవీ అయినా ఈ ఫాంటసీ అడ్వెంచర్ 300 కోట్ల గ్రాస్ మార్క్ ని అందుకుంది.