హనుమాన్ వసూళ్లతో బాక్సాఫీస్‌ను ఏలేసాడు!

హనుమాన్ వసూళ్లతో బాక్సాఫీస్‌ను ఏలేసాడు!
Cinema News

యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో తేజ సజ్జ హీరోగా అమృత అయ్యర్ హీరోయిన్ గా దర్శకుడు ప్రశాంత్ వర్మ తెరకెక్కించిన సాలిడ్ సూపర్ హీరో హిట్ మూవీ “హను మాన్. మరి భారీ అంచనాలు నడుమ వచ్చి వాటిని అన్నిటికన్నా మించి రీచ్ అయ్యి బాక్సాఫీస్ దగ్గర అదరగొట్టింది. ఇక నిన్న రిపబ్లిక్ డే హాలిడే ని అయితే తెలుగు రాష్ట్రాల్లో హను మాన్ బాగా క్యాష్ చేసుకుంది అని తెలిసిందే.

హనుమాన్ వసూళ్లతో బాక్సాఫీస్‌ను ఏలేసాడు!
Hanuman Movie

సాలిడ్ బుకింగ్స్ తో సాలిడ్ జంప్ ని అందుకోగా ఈ 15వ రోజు అయితే ఒక్క తెలుగు స్టేట్స్ లోనే ఐదున్నర కోట్లకి పైగా గ్రాస్ ని అందుకున్నట్టుగా తెలుస్తుంది. ఇది మాసివ్ నెంబర్ అని చెప్పాలి. దీనితో నిన్న ఒక్కరోజే ఈ మూవీ ఈజీగా 2 కోట్ల షేర్ మార్క్ ని క్రాస్ చేసింది. ఇక ఈరోజు శనివారం రేపు ఆదివారం కూడా మరోసారి “హను మాన్” మరింత స్ట్రాంగ్ వసూళ్లు రాబడుతుంది అని చెప్పొచ్చు . ఇక ఈ మూవీ కి గౌర హరీష్ సంగీతం అందించగా ప్రైమ్ షో ఎంటర్టైన్మెంట్స్ వారు నిర్మాణం వహించారు.