పుష్ప 2 షూటింగ్ ఆగిపోయిందా?

Has the shooting of Pushpa 2 stopped?
Has the shooting of Pushpa 2 stopped?

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా దర్శకుడు సుకుమార్ తో చేస్తున్న లేటెస్ట్ భారీ మూవీ “పుష్ప 2” కోసం అందరికీ తెలిసిందే. మరి ఈ మూవీ షూటింగ్ ఇప్పుడు శరవేగంగా కంప్లీట్ అవుతుంది. మరి రీసెంట్ గా ఈ మూవీ కొత్త షెడ్యూల్ ను వైజాగ్ లో ప్లాన్ చేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ షెడ్యూల్ కు ఇప్పుడు ఆకస్మిక బ్రేక్ పడింది. అల్లు అర్జున్ మొన్ననే వైజాగ్ వెళ్లగా నిన్న హైదరాబాద్ కు వచ్చేసాడు. ఈ విజువల్స్ కూడా వైరల్ అయ్యాయి.

Has the shooting of Pushpa 2 stopped?
Has the shooting of Pushpa 2 stopped?

అయితే అప్పుడే అల్లు అర్జున్ షూటింగ్ కంప్లీట్ చేసుకొని వచ్చేసాడు అని అంటున్నారు. కానీ ఈ కారణంలో నిజం లేదని తెలుస్తుంది. అల్లు అర్జున్ కు కొంచెం ఆరోగ్యం బాగోలేక హైదరాబాద్ కి వచ్చేసాడని తెలుస్తుంది. దీనితో వైజాగ్ షూట్ కి తాత్కాలికంగా బ్రేక్ పడిందట. అంతే కాకుండా షూట్ కంప్లీట్ చేసి కాదట. ఇక ఈ భారీ మూవీ కి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తుండగా మైత్రి మూవీ మేకర్స్ అలాగే సుకుమార్ రైటింగ్స్ వారు నిర్మాణం వహిస్తున్నారు. అలాగే ఈ ఆగస్ట్ 15న మూవీ గ్రాండ్ గా రిలీజ్ కానున్నది .