విస్తారంగా వానలు

Heavy Rainfall

ఈశాన్య బంగాళాఖాతం, దాని పరిసర ప్రాంతాల్లో ఏర్పడిన అల్పపీడనం కారణంగా ఆదివారం పలు జిల్లాల్లో వర్షాలు కురిశాయి. జగిత్యాల, ఆదిలాబాద్ జిల్లాలో భారీగా, ఉమ్మడి వరంగల్ జిల్లా, నాగర్‌కర్నూల్, కామారెడ్డి, నిజామాబాద్ జిల్లాల్లో ఓ మోస్తరు వానలు పడ్డాయి. వానలు కురుస్తుండటంతో రైతులు వ్య వసాయ పనుల్లో నిమగ్నమయ్యారు. సోమ, మంగళవారాల్లో రాష్ట్రంలోని పలుచోట్ల భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్న ట్టు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.