ఏపీ ప్రజలకు అలర్ట్: 3 రోజుల పాటు భారీ వర్షాలు

Alert for people of AP: Heavy rains for 3 days
Alert for people of AP: Heavy rains for 3 days

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు బిగ్ అలర్ట్. మూడు రోజులపాటు ఏపీలో భారీ వర్షాలు కురువనున్నాయి. ఈ మేరకు వాతావరణ శాఖ అధికారిక ప్రకటన చేసింది. ఉపరితల ఆవర్తన ప్రభావంతో ఈ నెల 26వ తేదీ నాటికి… బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడుతుందని అమరావతి వాతావరణ కేంద్రం ప్రకటించింది. 27వ తేదీ కల్లా అండమాన్ తీరంలో వాయుగుండంగా బలపడనుంది.

28వ తేదీన ఉత్తర ఈశాన్యంగా దిశ మార్చుకొని బంగ్లాదేశ్ వైపు ప్రయాణిస్తుందని… ఈ క్రమంలో బలపడి తుఫాన్ గా మారనుందని అంచనా వేసింది వాతావరణ శాఖ. నీటి ప్రభావంతో ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా రాబోయే మూడు రోజుల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తారు వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ స్పష్టం చేసింది. ముఖ్యంగా కృష్ణ, బాపట్ల, అనంతపూర్, శ్రీ సత్య సాయి, చిత్తూరు, తిరుపతి, శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం, మన్యం, అల్లూరి, విశాఖ, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, ఎన్టీఆర్, గుంటూరు, పల్నాడు లాంటి జిల్లాలలో భారీ వర్షాలు కురుస్తాయని స్పష్టం చేసింది.