కలెక్టర్లకి సీఎం ఆదేశాలు

కలెక్టర్లకి సీఎం ఆదేశాలు

ఎడతెరిపి లేని వర్షాలు, వరదలతో ఆంధ్రప్రదేశ్‌ తడిసిముద్దయింది. వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. కృష్ణా నదికి భారీగా వరద పోటెత్తుతోంది. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి భారీ వర్షాలు, సహాయక చర్యలపై బుధవారం మధ్యాహ్నం సమీక్ష నిర్వహించారు. మంత్రులు సుచరిత, బొత్స, సీఎస్‌ నీలంసాహ్ని కార్యక్రమంలో పాల్గొన్నారు. జిల్లా కలెక్టర్లు,అధికారులతో జిల్లాలవారీగా సీఎం సమీక్షించారు.

ప్రభుత్వ యంత్రాంగమంతా అప్రమత్తంగా ఉండాలని ఈ సందర్భంగా సీఎం ఆదేశించారు. విద్యుత్‌ పునరుద్ధరణ యుద్ధప్రాతిపదికన చేపట్టాలని సీఎం ఆదేశించారు. రోడ్ల పునరుద్ధరణ పనులు వేగంగా చేపట్టి వరద బాధితులకు సాయం చేయాలని అన్నారు. అదేసమయంలో వర్షాల వల్ల వచ్చే వ్యాధులపై దృష్టి పెట్టాలని సీఎం చెప్పారు. పునరావాస కేంద్రాల్లో ఉన్నవారికి అవసరమైన సాయం అందించాలని అన్నారు. తాగునీటి సరఫరాపై దృష్టి పెట్టాలన్న సీఎం వైఎస్‌ జగన్ ఆదేశించారు.