కాలిఫోర్నియాలో కూలిపోయిన హెలికాప్టర్‌

కాలిఫోర్నియాలో కూలిపోయిన హెలికాప్టర్‌

ఉత్తర కాలిఫోర్నియాలో హెలికాప్టర్‌ కూలిపోయిన ఘటన విషాదాన్నినింపింది. మారుమూల ప్రాంతంలో చోటుచేసుకున్న ఈ ప్రమాదంలో నలుగురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఈ విషయాన్ని కేఎస్‌టీవీ స్టేషన్‌ డిపార్ట్‌మెంట్‌ ధ్రువీకరించింది.ది రాబిన్​సన్​ ఆర్​66 అనే హెలికాప్టర్ ఆదివారం మధ్యాహ్నం 1.15 సమయంలో శాక్రమెంటోకు ఉత్తరాన కొలూసా కౌంటీలో ప్రాంతంలో కుప్పకూలింది.

ఈ మేరకు ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ ఒక ప్రకటన విడుదల చేసింది. ఈ ప్రమాదంలో నలుగురు మరణించిన విషయాన్ని ధృవీకరించినప్పటికీ, మృతుల వివరాలు ఇంకా తెలియాల్సి ఉందని పేర్కొంది. ప్రాథమిక సమాచారం ప్రకారం నలుగురు వ్యక్తులు చనిపోయినట్టుగా తెలుస్తోందని అధికారులు తెలిపారు. దర్యాప్తు కొనసాగుతోందని ఎఫ్ఏఏ, నేషనల్ ట్రాన్స్‌పోర్టేషన్ సేఫ్టీ బోర్డులు ప్రకటించాయి.