నాని వల్ల ‘హలో’కు చాలా నష్టం

Hello Movie Got Loss Due to Nani MCA

 Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 

యంగ్‌ హీరో నాని తాజాగా ఎంసీఏ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. సాయి పల్లవి హీరోయిన్‌గా నటించిన ఆ చిత్రాన్ని వేణు శ్రీరామ్‌ దర్శకత్వంలో దిల్‌రాజు నిర్మించాడు. మాస్‌ ఆడియన్స్‌ను ఆకట్టుకునేలా ఉన్న ఎంసీఏ చిత్రానికి మంచి కలెక్షన్స్‌ వస్తున్నాయి. మొదట సినిమాకు నెగటివ్‌ టాక్‌ వచ్చినా కూడా రోజు గడుస్తున్నా కొద్ది కలెక్షన్స్‌ పెరుగుతున్నాయి. ప్రేక్షకులు కూడా ఎంసీఏపై ఆసక్తి కనబర్చుతున్నారు. ఇక ఎంసీఏ చిత్రం విడుదలైన ఒక్కరోజు తర్వాత ప్రేక్షకుల ముందుకు వచ్చిన ‘హలో’ చిత్రం యావరేజ్‌ టాక్‌ను తెచ్చుకుని కలెక్షన్స్‌ లేక విలవిల ఆడుతోంది. 

‘మిడిల్‌ క్లాస్‌ అబ్బాయి’ చిత్రం వల్ల హలో చిత్రంకు కలెక్షన్స్‌ రావడం లేదని చిన్న పిల్లాడిని అడిగినా చెబుతాడు. ఎందుకంటే హలో కు పోటీ లేకుంటే యావరేజ్‌గా మూవీ ఉంది కనుకు తప్పకుండా మంచి కలెక్షన్స్‌ వచ్చేవి. కాని ‘ఎంసీఏ’ చిత్రం ఉన్న నేపథ్యంలో ప్రేక్షకులు ఎక్కువగా ఆ చిత్రం వైపు మొగ్గు చూపుతున్నారు. దాంతో అఖిల్‌ ‘హలో’ చిత్రంపై తీవ్ర ప్రభావం పడుతుంది. 

ఎంసీఏ వల్ల హలో చిత్రం సగానికి పైగా కలెక్షన్స్‌ను నష్టపోవాల్సి వస్తుందని ట్రేడ్‌ పండితులు అంటున్నారు. మొదటి నుండి కూడా నాగార్జున అండ్‌ టీం ‘హలో’ చిత్రాన్ని పోటీ లేకుండా విడుదల చేయాలని భావించారు. కాని ఎంసీఏ అడ్డు పడటంతో ఆలోచనల్లో పడ్డారు. ఎంసీఏను విడుదల వాయిదా వేయించే ప్రయత్నం చేసినా కూడా దిల్‌రాజు అందుకు నో చెప్పాడు. దాంతో తప్పని పరిస్థితుల్లో ఎంసీఏ చిత్రానికి పోటీగా హలోను విడుదల చేయడం జరిగింది. ఊహించిందే జరిగి ‘హలో’కు భారీ నష్టాలు తప్పడం లేదు.