ట్రైలర్‌ రివ్యూ : ఏంటీ బాలయ్య మళ్లీ అవే డైలాగ్‌లేనా..?

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 

balakrishna-jai-simha-trailer-review

ఈ సంవత్సరంలో నందమూరి బాలకృష్ణ 100వ చిత్రం ‘గౌతమిపుత్ర శాతకర్ణి’ ప్రేక్షకుల ముందుకు వచ్చి ఆకట్టుకుంది. బాలయ్య కెరీర్‌లోనే అతి పెద్ద విజయాన్ని ఆ చిత్రం అందుకుంది. ఆ తర్వాత పూరి దర్శకత్వంలో ‘పైసా వసూల్‌’ చిత్రాన్ని చేసి బొక్క బోర్లా పడ్డాడు. ఇక తాజాగా తమిళ దర్శకుడు ఏఎస్‌ రవికుమార్‌ దర్శకత్వంలో ‘జైసింహా’ అనే చిత్రాన్ని చేశాడు. భారీ అంచనాల నడుమ రూపొందిన ‘జైసింహా’ చిత్రం ఆడియో విడుదలైంది. అదే సమయంలో ట్రైలర్‌ను కూడా విడుదల చేశారు. ఈ చిత్రం ముందు నుండి ఆశించినట్లుగా నందమూరి ఫ్యాన్స్‌కు ఫుల్‌ మీల్స్‌ చిత్రంలా ఉండబోతుంది. ట్రైలర్‌లో యాక్షన్‌ సీన్స్‌ మరియు డైలాగ్స్‌లు బాలయ్య గత చిత్రాలు ‘సింహా’, ‘లెజెండ్‌’ చిత్రాలను గుర్తుకు తెస్తుంది.

balakrishna-jai-simha

నందమూరి ఫ్యాన్స్‌ను సంతోష పర్చిన ఈ చిత్రం సాదారణ ప్రేక్షకులకు మాత్రం అంతగా నచ్చలేదు. బాలయ్య మళ్లీ అవే భారీ డైలాగ్స్‌ చెబుతూ, యాక్షన్‌ సీన్స్‌లతో బోర్‌ కొట్టిస్తున్నాడని, బాలయ్య ఇంకా ఇలాంటివి ఎన్నాళ్లు చేస్తాడు అంటూ సాదారణ ప్రేక్షకులు ప్రశ్నిస్తున్నారు. బాలయ్య నుండి కొత్తగా ఏమైనా చూడాలని సాదారణ ప్రేక్షకులు కోరుకుంటున్నారు. కాని ఫ్యాన్స్‌ కోరిక మేరకు భారీ డైలాగ్స్‌, గుక్కతిప్పుకోకుండా చెప్పే డైలాగ్స్‌ను బాలయ్య చెబుతున్నాడు.

jai-simha-trailer-release

యాక్షన్‌ సీన్స్‌తో ‘జై సింహా’ చిత్రం ఏ స్థాయిలో ఉండబోతుందో ట్రైలర్‌లో చెప్పకనే చెప్పాడు. తప్పకుండా ఈ చిత్రం బాలయ్యకు నచ్చే విధంగా ఉంటుందని సినీ విశ్లేషకులు అంటున్నారు. అయితే సాదారణ ప్రేక్షకులు ఈ సినిమాను ఆధరిస్తారు అనే నమ్మకం లేదని అంటున్నారు. బాలయ్యకు జోడీగా ఈ చిత్రంలో నయనతారతో పాటు నటాషా మరియు హరిప్రియలు నటిస్తున్నారు. బాలయ్య ద్విపాత్రాభినయం చేస్తున్న ఈ చిత్రం సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.