ఆ సర్వేతో కెసిఆర్ వాగ్దాన భంగం తప్పదా?

OU Students Survey Tolds TRS Party Will Get 52 Seats In 2019 Elections

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 

ఎప్పుడు ఎన్నికలు వచ్చినా తెలంగాణాలో మళ్లీ వచ్చేది తెరాస ప్రభుత్వమే. ఇదే నమ్మకం కొన్ని నెలల ముందు వరకు కనిపించింది. ఆ నమ్మకంతోటే మొన్నామధ్య పార్టీ సిట్టింగ్ ఎమ్మెల్యేలతో సమావేశం అయిన సీఎం కెసిఆర్ వచ్చే ఎన్నికల్లో టిక్కెట్ల గురించి ఆందోళన వద్దని, ప్రజా సమస్యలపై దృష్టి పెట్టాలని వారికి సూచించారు. ఓ విధంగా చెప్పాలంటే వచ్చే ఎన్నికల్లో సిట్టింగ్ లందరికీ టిక్కెట్లు గ్యారంటీ అని భరోసా ఇచ్చారు. అయితే కెసిఆర్ తో పాటు తెరాస శ్రేణులు అనుకున్నట్టు వచ్చే ఎన్నికల ప్రయాణం అంత సాఫీగా ఉండబోదని ఇప్పుడిప్పుడే అర్ధం అవుతోందట.

విభజన ఉద్యమం తారాస్థాయిలో జరిగి తెలంగాణ కల సాకారం అయినప్పుడే తెరాస కి వచ్చింది 63 సీట్లు. అయితే ఆ తర్వాత ఆపరేషన్ ఆకర్ష్ తో తెరాస కి మద్దతిచ్చే ఎమ్మెల్యేల సంఖ్య పెరిగింది గానీ ప్రజాక్షేత్రంలో అదే స్థాయి వాతావరణం లేదని తాజా సర్వేలో తెరాస కి అర్ధం అయ్యిందట. కాంగ్రెస్ బలం పుంజుకుంటున్న కొద్దీ తెలంగాణాలో తెరాస దూకుడు తగ్గుతోందట. తెలంగాణాలో ఇటీవల ఉస్మానియా విద్యార్థులు జరిపిన ఓ సర్వే లో తెరాస ఓడిపోతుందని సోషల్ మీడియా కోడై కూసింది. అందులో నిజానిజాలు తెలుసుకునేందుకు తెరాస కూడా సొంతంగా ఓ సర్వే జరిపించుకుందట.

ఆ సర్వే లో ఇప్పటికిప్పుడు ఎన్నికలు వస్తే తెరాస 52 స్థానాల్లో మాత్రమే గెలుస్తుందన్న నివేదిక వచ్చిందట. దాన్ని సమగ్రంగా విశ్లేషించిన తెరాస హైకమాండ్ కొందరు అభ్యర్ధులని మార్చడం ద్వారా మరికొన్ని స్థానాలు పార్టీ ఖాతాలో పడతాయని అంచనాకి వచ్చిందట. అలా కొందరు సిట్టింగ్ లకి కూడా అభ్యర్థిత్వం దక్కకపోవచ్చని సమాచారం. ఆ విధంగా ఇంతకుముందు కెసిఆర్ ఇచ్చిన వాగ్దానం భంగం అయ్యేట్టు వుంది.