జనసేనలోకి శివబాలాజీ.

hero shiva balaji entry into politics

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 

జనసేన పార్టీ నిర్మాణం ఊపు అందుకుంది. పవన్ తో పాటు నడవాలి అనుకునే సినీ నటులు కొందరు పార్టీలో చేరేందుకు రెడీ అవుతున్నారు. వీరిలో ముందు వరసలో వుంది బిగ్ బాస్ విజేత శివబాలాజీ అని తెలుస్తోంది. ఆయన నేడో, రేపో పార్టీలో చేరిపోతారట. ఈ విషయంలో ఇప్పటికే పవన్ అనుమతి తీసుకుని ముహూర్తం కూడా నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది. పార్టీ లో చేరిన వెంటనే శివబాలాజీకి కొన్ని బాధ్యతలు అప్పగించేందుకు కూడా కసరత్తు జరిగిందట.

బిగ్ బాస్ తో శివబాలాజీ మళ్లీ వెలుగులోకి వచ్చాడు. సినీ రంగంలో నిలబడేందుకు ఆయన సొంతంగా చేసిన సినిమా స్నేహమేరా జీవితం పెద్దగా ఉపయోగపడలేదు. దీంతో పవన్ వెంట నడిచేందుకు నిర్ణయించుకున్న శివబాలాజీ రాజకీయాల్లో ఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధం అయిపోయారు. కాటమరాయుడు సినిమాలో నటించేటప్పుడు పవన్ తో శివబాలాజీ బంధం బలపడింది. అప్పట్లో రామ్ గోపాల్ వర్మ లాంటి వాళ్ళు ఆ సినిమా మీద చేసిన వ్యాఖ్యలను తప్పుబడుతూ శివబాలాజీ బయటకు వచ్చారు. కాటమరాయుడు సినిమా షూటింగ్ టైం లో శివబాలాజీ పుట్టిన రోజు వేడుకలు పవన్ దగ్గరుండి జరపడం వంటి విషయాలు ఆ ఇద్దరి మధ్య అనుబంధానికి దారి తీసింది.