దేవిశ్రీప్రసాద్… తెలుగు బులెట్ రివ్యూ.

devi sri prasad Movie review

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 

నటీనటులు :  ధనరాజ్, మనోజ్ నందమ్, పూజా రామచంద్రన్, భూపాల్ రాజు, పోసాని కృష్ణ మురళి, వేణు టిల్లో

నిర్మాత:   డి వెంకటేష్
దర్శకత్వం :  శ్రీ కిషోర్
మ్యూజిక్ : సయ్యద్ కమ్రాన్

తెలుగు సినిమా కొత్త పోకడలు పోతుందనేందుకు దేవి శ్రీ ప్రసాద్ సినిమా ఓ ఉదాహరణ. శవంతో శృంగారం అనే పాయింట్ చుట్టూ ఓ కథ అని ఒకప్పుడు ఏ దర్శకుడైనా నిర్మాతల దగ్గరికి వెళితే వెంటపడి తరిమేవారు. వింటేనే ఒళ్ళు జలదరించే ఆ నెగటివ్ పాయింట్ చుట్టూ అల్లుకున్న కథతో సినిమా వచ్చిందంటే ఆశ్చర్యం కలుగుతుంది. ఓ కొరియన్ ఫిలిం స్పూర్తితో తీసిన ఈ సినిమా ప్రేక్షకులకు ఏ అనుభూతి ఇచ్చిందో చూద్దాం.

కథ…

దేవి ,శ్రీ ,ప్రసాద్ ముగ్గురు స్నేహితులు. దేవి ఆటో డ్రైవర్. శ్రీ ఓ హాస్పిటల్ లో వార్డ్ బాయ్ . ఇక ప్రసాద్ టీ కొట్టు నడుపుకుంటాడు.వీరిలో దేవి కాస్త వైల్డ్ . శ్రీ గోడ మీద పిల్లి టైపు . ప్రసాద్ మంచోడు అనిపిస్తారు . ఈ ముగ్గురికి హీరోయిన్ లీల అంటే పిచ్చి ఇష్టం. ఓ రోజు ఆమె తమ ఏరియా లో షూటింగ్ కి వస్తుంది అని తెలిసి సంబరపడిపోతారు. ఆమె ని దూరం నుంచి చూసి రాగానే ఓ ప్రమాదంలో లీల చనిపోయిందని తెలుస్తుంది. ఆమె శవాన్ని శ్రీ పని చేస్తున్న హాస్పిటల్ మార్చురీ కి తీసుకొస్తారు. ఆమెని దగ్గరగా చూసేందుకు శ్రీ సాయంతో వాళ్ళు మార్చురీకి వెళతారు. అంత దగ్గరగా లీల ని చూసిన దేవికి దుర్బుద్ధి పుడుతుంది. ఇంతలో వాళ్ళు ఎవరూ ఊహించని విధంగా లీల బతుకుంది. అదెలా సాధ్యమైంది ? అసలు ఏమి జరిగింది ? ఈ ముగ్గురు స్నేహితుల జీవితాలు ఏ మలుపు తీసుకున్నాయి అన్నదే మిగిలిన కథ.

విశ్లేషణ …

స్త్రీలకు రక్షణ లేకుండా పోయింది …చివరకు చనిపోయినా వదిలిపెట్టడం లేదు అనే పాయింట్ చుట్టూ దర్శకుడు శ్రీ కిషోర్ ఈ కథ అల్లుకున్నాడు. ఈ విషయాన్ని సీరియస్ గా కాకుండా కాస్త కొత్త తరహా ఆలోచనలు, కధనంతో నడపడానికి శ్రీ కిషోర్ ట్రై చేసాడు. తాను అన్నదాన్ని అనుకున్నట్టు తీయగలిగాడు. కానీ ఓ క్రైమ్ ఎలిమెంట్ చుట్టూ కథ అల్లుకున్నప్పుడు , ఆ కధలో ఇన్వెస్టిగేషన్ కూడా ఓ భాగం అయినప్పుడు లాజిక్ కి మరీ దూరంగా జరగడాన్ని ఒప్పుకోలేము. ఇక్కడా అదే జరిగింది. సినిమా నిడివి కేవలం 90 నిమిషాలే కావడం తో ఎక్కడా విసుగు అనిపించకపోయినా లాజిక్ మిస్ అయిన ఫీలింగ్ చాలా చోట్ల వస్తుంది. అయితే కేవలం ఐదు పాత్రల చుట్టూ సినిమాని తిప్పుతూ ఎక్కడా బోర్ లేకుండా తీసినందుకు దర్శకుడుని మెచ్చుకోవాల్సిందే.

దేవి, శ్రీ, ప్రసాద్ పాత్రలు వేసిన భూపాల్ , ధనరాజ్ , మనోజ్ నందం తన పరిధిలో బాగా చేశారు. కధకు కేంద్ర బిందువు లాంటి పాత్ర వేసిన పూజ రామచంద్రన్ కూడా పర్లేదు అనిపించింది. పోసాని, వేణు ఓకే. ఈ సినిమాకి పని చేసిన సాంకేతిక సిబ్బంది గురించి కూడా చెప్పుకోవాలి. కమ్రాన్ సంగీతం సినిమా మూడ్ ని ఎలివేట్ చేసింది. ఫణీంద్ర వర్మ కెమెరా పని తీరు ఓకే. ఇక శేఖర్ విఖ్యాత్ రాసిన మాటలు కొన్ని ఇంటి దాకా వస్తాయి. నిర్మాణ విలువలు కధకు తగ్గట్టు కుదిరాయి.

ప్లస్ పాయింట్స్ …
కధకు సెంట్రల్ పాయింట్
దర్శకత్వం
లీడ్ నటులు

మైనస్ పాయింట్స్ …
లాజిక్ మిస్ కావడం

తెలుగు బులెట్ పంచ్ లైన్ …”దేవిశ్రీప్రసాద్” నేటి పోకడల ఆనవాళ్లు.
తెలుగు బులెట్ రేటింగ్ … 2 .75 / 5 .