శ్రీకాంత్‌కు కోపం వచ్చింది

Hero Srikanth Condemns his Family Accident

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 
ఫ్యామిలీ చిత్రాల హీరోగా మంచి గుర్తింపు తెచ్చుకున్న శ్రీకాంత్‌కు గత కొంత కాలంగా ఆశించిన స్థాయిలో సక్సెస్‌లు దక్కడం లేదు. దాంతో హీరో పాత్రలకు గుడ్‌ బై చెప్పి క్యారెక్టర్‌ ఆర్టిస్టుగా, విలన్‌గా సెటిల్‌ అవ్వాలని భావిస్తున్నాడు. విలన్‌ పాత్రలకు మరికాస్త సమయం తీసుకోవాలని కొందరు సూచించడంతో మళ్లీ హీరోగా ఒకటి రెండు సినిమాలు చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నాడు. ఆమద్య చేసిన ఒక చిత్రం విలన్‌గా శ్రీకాంత్‌కు నిరాశను మిగిల్చింది. దాంతో ప్రస్తుతం శ్రీకాంత్‌ కెరీర్‌ కష్టాల్లో ఉందని చెప్పుకోవచ్చు. ఇలాంటి సమయంలో శ్రీకాంత్‌ ఫ్యామిలీ గురించిన ఒక వార్త సోషల్‌ మీడియాను కుదిపేసింది.

శ్రీకాంత్‌ భార్య మరియు పిల్లలు ఇటీవల బెంగళూరులో ఒక యాక్సిడెంట్‌లో తీవ్రంగా గాయపడ్డారని, శ్రీకాంత్‌ భార్య కోమాలో ఉంది అంటూ పుకార్లు షికార్లు చేశాయి. మీడియాలో వచ్చిన వార్తలు చూసి చాలా మంది సన్నిహితులు మరియు శ్రీకాంత్‌ బంధువులు ఫోన్‌లు చేసి ఆరోగ్య పరిస్థితిని ఎంక్వౌరీ చేసినట్లుగా తెలుస్తోంది. పలువురు తనకు కాల్‌ చేయడంతో శ్రీకాంత్‌ అసహనంకు లోనయ్యాడు. అసలు ఈ పుకారేంటని తెలుసుకునే ప్రయత్నం చేశాడు. మీడియా ముందుకు వచ్చి తన కుటుంబంకు ఎలాంటి హానీ జరగలేదని, మీడియాలో వస్తున్న పుకార్లను నమ్మొదు అంటూ తేల్చి చెప్పాడు. స్వయంగా శ్రీకాంత్‌ మీడియా ముందుకు రావడంతో పుకార్లకు ఫుల్‌స్టాప్‌ పడ్డట్లయ్యింది.