షూటింగ్ లో మిస్సయిన హీరోయిన్ …!

Heroine Missed During Movie Shoot

షూటింగ్ జరుగుతుండగా షూటింగ్ స్పాట్ నుంచి అదృశ్యమైంది హీరోయిన్ అనుపమ. అనుపమ అంటే అనుపమ పరమేశ్వరన్ అనుకునేరు, కాదండోయ్ అనుపమా ప్రకాష్. తమిళ డైరెక్టర్ కేశవన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న తమిళ చిత్రం ‘అవళుక్కెన్న అళగియ ముగం’ (ఆమెకు ఏం అందమైన ముఖం) అనే చిత్రంలో హీరోయిన్‌గా అనుపమా ప్రకాష్‌‌ నటిస్తోంది. ఈ చిత్రం షూటింగ్ ఎత్తైన కొండ ప్రాంతమైన కొడైక్కెనాల్‌లో జరుగుతోంది.

anupuma-prakesh

ఈ స్పాట్ నుంచి ఆమె ఒక్కసారిగా కనిపించకుండా పోయింది. తమిళనాడులోని కొడైక్కెనాల్ నుంచి కనిపించకుండా పోయిన ఆ హీరోయిన్ చివరకు ఢిల్లీలో తేలింది. ఇంతకు ఆ హీరోయిన్ అలా మిస్ కావడానికి గల కారణాలను తెలుసుకుంటే కొండ ప్రాంతంలో ఎత్తైన ప్రాంతంలో తన చేత నృత్యం చేయించడంతో భయాందోళనకు గురయ్యానని అందుకే షూటింగ్‌ నుంచి ఎవరికి చెప్పకుండా తన గదికి వెళ్లిపోయిన ఈమె తర్వాత చిత్ర బృందానికి తెలియకుండా మదురై వెళ్లిపోయింది. అక్కడి నుంచి విమానంలో ఢిల్లీకి వెళ్లింది. దీంతో విషయం తెలియని నిర్మాత ఆమె ఏ లోయలో పడిందోనన్న అనుమానంతో పోలీసులకి కూడా ఫిర్యాదు చేసారు. చివరికి ఆమె ఢిల్లీ వెళ్లిందని తెలుసుకుని ఆమెను బతిమలాడుకుని మళ్ళీ షూటింగ్ కి తెచ్చుకునారు.

anupuma1