వర్మ స్టైల్‌లో ‘భైరవ గీత’ట్రైలర్

BHAIRAVGEETHA

సంచలన ద‌ర్శ‌కుడు రామ్ గోపాల్ వర్మ ఎందుకో గానీ కొన్నాళ్ళుగా స‌క్సెస్ కి దూరం గా ఉన్నాడు. తన దగ్గర పని నేర్చుకున్న అజయ్ భూపతి లాంటి వాళ్ళు హిట్స్ కొడుతుంటే ఆయన వాటిని ఎంజాయ్ చేస్తున్నాడు కానీ పట్టుదలాగా తీసుకోవడం లేదు. తన హోమ్ బేనర్ కంపెనీ ప్రొడక్షన్స్ లో ఆఫీసర్ అనే చిత్రాన్ని నిర్మించిన‌ వర్మకి ఈ సినిమా నిరాశ పరచింది. దీంతో కొన్నాళ్లు ఆయన మౌనంగా ఉన్నాడు. ఇక ఇప్పుడు మరో చిత్రాన్ని తన నిర్మాణంలో రూపొందిస్తున్నాడు.

BhairavaGeetha

భైరవగీత అనే టైటిల్ తో రూపొందిన ఈ చిత్రంలో ధనన్జయక మరియు ఇర్రా హీరో హీరోయిన్ లుగా నటిస్తున్నారు. సిద్ధార్ధ తాతోలు ఈ మూవీతో దర్శకుడిగా పరిచయం కాబోతున్నాడు. అభిషేక్ పిక్చర్స్ సంస్థ ఈ చిత్రాన్ని దాదాపు చిత్ర షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ మూవీ త్వరలోనే విడుదల కానుంది. అయితే కొద్ది సేప‌టి క్రితం చిత్ర ట్రైల‌ర్ విడుద‌ల చేశారు. ట్రైల‌ర్ చూస్తుంటే ఈ మూవీ అభిమానులని త‌ప్ప‌క అల‌రించ‌నుంద‌ని అర్ధ‌మ‌వుతుంది. తాజాగా విడుద‌లైన ట్రైల‌ర్‌పై మీరు ఓ లుక్కేయండి.