‘కల్కీ’లో ధన్సిక క్లారిటీ

Heroine Sai Dhansika Signs For Rajashekar movie

యాంగ్రీ యంగ్‌మన్‌ రాజశేఖర్‌ హీరోగా ప్రశాంత్‌ వర్మ దర్శకత్వంలో తెరకెక్కబోతున్న చిత్రం ‘కల్కీ’. భారీ అంచనాల నడుమ రూపొందబోతున్న ఈ చిత్రం మోషన్‌ పోస్టర్‌ తాజాగా విడుదలైన విషయం తెల్సిందే. ఇక ఈ చిత్రం స్క్రిప్ట్‌ వర్క్‌ దాదాపుగా పూర్తి అయ్యింది. ప్రస్తుతం నటీనటుల ఎంపిక జరుగుతుంది. ఈ చిత్రంలో హీరోయిన్‌ పాత్ర కోసం కాజల్‌ను చిత్ర దర్శకుడు సంప్రదించాడు. కాని కొన్ని కారణాలు చూపుతూ ఆమె ఈ చిత్రంకు నో చెప్పింది. దాంతో దర్శకుడు ప్రశాంత్‌ వర్మ మరో హీరోయిన్‌ వేటలో పడ్డాడు. అంజలితో ఈయన చర్చలు జరపడంతో పాటు, దాదాపుగా ఓకే అయ్యిందని వార్తలు వచ్చాయి. ఈసమయంలోనే తమిళంకు చెందిన మరో హీరోయిన్‌ సాయి ధన్సికను కూడా ఈయన సంప్రదించాడు అంటూ తమిళ మీడియా సంస్థల్లో వార్తలు వస్తున్నాయి.

kalki-movie

అంజలి కాకుండా రాజశేఖర్‌కు జోడీగా సాయి ధన్సిక నటించబోతుందా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. అయితే చిత్ర యూనిట్‌ సభ్యులు ఈ విషయమై క్లారిటీ ఇచ్చారు. అంజలి ఈ చిత్రంలో నటించనుంది. ముఖ్య పాత్రలో ధన్సిక కనిపిస్తుందని చెబుతున్నారు. ధన్సికతో రాజశేఖర్‌ రొమాన్స్‌ ఉంటుందా లేదంటే, మరేదైనా పాత్రలో ఆమెను ఎంపిక చేశారా అనే విషయంలో క్లారిటీ లేదు. గరుడవేగ చిత్రం సక్సెస్‌ అవ్వడంతో రాజశేఖర్‌ చేస్తున్న ఈ చిత్రంపై అంచనాలు భారీగా ఉన్నాయి. సన్నిహితులతో కలిసి ఈ చిత్రాన్ని జీవిత రాజశేఖర్‌లు నిర్మిస్తున్నారు. త్వరలోనే చిత్రీకరణ ప్రారంభించబోతున్నట్లుగా తెలుస్తోంది.

rajashaker-kalki