రాజశేఖర్‌ ఇంకా హీరోగా చేయవచ్చు..

rajasekhar PSV garuda vega movie positive talk

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 

చాలా సంవత్సరాలుగా రాజశేఖర్‌కు సక్సెస్‌ లేదు. అయినా కూడా మొండి పట్టుదలతో హీరోగా కొనసాగుతూ వస్తున్నాడు. సీనియర్‌ హీరోలు సక్సెస్‌లు తగ్గితే వెంటనే విలన్‌ వేశాలు లేదా క్యారెక్టర్‌ ఆర్టిస్టు వేశాలు వేస్తారు. కాని రాజశేఖర్‌కు విలన్‌ వేశాలు వేసేందుకు మనస్సు ఒప్పడం లేదు. ఆ మద్య విలన్‌ వేశం వేస్తాను అంటూ చెప్పినా కూడా ఆ తర్వాత మనస్సు మార్చుకున్నాడు. ఇంకా కొన్నాళ్లు హీరోగానే కొనసాగుతాను అంటూ చెప్పుకొచ్చాడు. తాజాగా చేసిన ‘గరుడవేగ’ చిత్రం ఫలితం రాజశేఖర్‌ను మరికొంత కాలం హీరోగా కంటిన్యూ అయ్యేలా చేసింది.

నిన్న మొన్నటి వరకు రాజశేఖర్‌ ఇక హీరోగా పనికి రాడు అంటూ పలువురు కామెంట్స్‌ చేశారు. కాని రాజశేఖర్‌ మాత్రం తన ప్రయత్నం చేసుకుంటూ వచ్చాడు. తాజాగా గరుడవేగలో రాజశేఖర్‌ చూపించిన ఎమోషన్‌, హైఓల్టేజ్‌ నటనకు ప్రేక్షకులు ఫిదా అవుతున్నారు. అప్పటి పవర్‌ ఏమాత్రం తగ్గలేదని, యాంగ్రీయంగ్‌ మన్‌లో ఇంకా సత్తా ఉందని సినీ విశ్లేషకులు కూడా అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. సినిమాకు పాజిటివ్‌ టాక్‌ వచ్చిన నేపథ్యంలో రాజశేఖర్‌తో ఇంకా సినిమాలు చేసేందుకు దర్శకు ఆసక్తి చూపించే అవకాశం ఉంది. రాజశేఖర్‌ ఇంకో మూడు నాలుగు సంవత్సరాలు హీరోగా కంటిన్యూ అవ్వొచ్చు అంటూ సినీ విశ్లేషకులు అంటున్నారు.

‘గరుడవేగ’ చిత్రం పాజిటివ్‌ టాక్‌ను దక్కించుకున్న నేపథ్యంలో రాజశేఖర్‌ ఇప్పటికే కమిట్‌ అయ్యి ఆగిపోయిన కొన్ని సినిమాలను పూర్తి చేసే అవకాశం ఉంది. ఇక హీరోగా సక్సెస్‌ఫుల్‌గా ఉన్న సమయంలోనే క్యారెక్టర్‌ ఆర్టిస్టుగా ఎంట్రీ ఇవ్వడం కూడా మంచిది అనే అభిప్రాయం వ్యక్తం అవుతుంది. హీరోగా ఫెయిల్‌ అయ్యి చివరకు విలన్‌ వేశాలు వేసుకుంటున్నాడు అనే టాక్‌ రాకుండా ఉండాలి అంటే రాజశేఖర్‌ మెల్లగా విలన్‌ పాత్రలు లేదా క్యారెక్టర్‌ ఆర్టిస్టు పాత్రలకు ఓకే చెప్పడం మంచిదని కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఈ విజయంపై రాజశేఖర్‌ స్పందన ఏంటీ? ఆయన ప్యూచర్‌ ఫ్లాన్స్‌ ఏంటీ అనే విషయాలపై త్వరలోనే క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.