హాస్టల్ యువతులు టార్గెట్ గా… హైటెక్ దందా..

యువత పెడదారి పడుతోంది. అదేంటో ఇప్పటికే ఎన్నో ఘటనలు చోటుచేసుకోవడం చూశాం. తాజాగా అందమైన కాలేజీ అమ్మాయిలను లొంగదీసుకొని వారికి కూల్ డ్రింక్స్ లో మత్తు మందు, ఆ తర్వాత డ్రగ్స్ కలిపి ఇచ్చి నగ్నంగా పోర్న్ వీడియోలు తీస్తున్నారు. తర్వాత అమ్మాయిల అందాన్ని లెక్కకట్టి ఆ పోర్న్ వీడియోలు వారికి చూపించి బ్లాక్ మెయిల్ చేసి హైటెక్ వ్యభిచారం చేయిస్తున్నారు. కాలేజ్ అమ్మాయిలే కాకుండా హైస్కూల్స్ కు బాలికలైన కొందరితో వ్యభిచారం చేయిస్తున్న ముఠా రహస్యాలు తాజాగా బయటపడింది. కాలేజ్, స్కూల్ విద్యార్థుల జీవితాలతో చెలగాటం ఆడుతున్న ముగ్గురిని పోలీసులు అరెస్టు చేశారు. హైటెక్ రెస్టారెంట్, మొబైల్ ఫోన్లు సర్వీసు చేసే షాప్ నుంచి ఈ హైటెక్ వ్యభిచారం దందా మొదలైయ్యిందని తెలుసుకున్న కాలేజ్ అమ్మాయిలు, వారి కుటుంబ సభ్యులు షాక్ కు గురౌతున్నారు.

తాజాగా తమిళనాడులోని ప్రపంచ ప్రసిద్ది చెందిన పుణ్యక్షేత్రం మదురైలో మదురమీనాక్షి అమ్మావారి ఆలయం సమీపంలో పేరుమోసిన ప్రైవేట్ కాలేజ్ ఉంది. మదురై నగరంతో పాటు అనేక ప్రాంతాలకు చెందిన విద్యార్థులు ఈ ప్రేవైట్ కాలేజ్ లో విద్యాభ్యాసం చేస్తున్నారు. ప్రైవేట్ కాలేజ్ లో చదువుతున్న ఓ విద్యార్థికి పదేపదే ఒక ఫోన్ నెంబర్ నుంచి పోర్న్ ఎస్ఎంఎస్ లు వెళ్లాయి. తన ఫోన్ కు పదేపదే పోర్న్ ఎస్ఎమ్ఎస్ లు, వీడియోలు రావడంతో ఆ విద్యార్థికి షాక్ కు గురయ్యాడు. తనకు పదేపదే పోర్న్ ఎస్ఎమ్ఎస్ లు, వీడియోలు ఎవరు పంపిస్తున్నారు? అని తెలుసుకోవడానికి ఆ విద్యార్థి ఒక ఫోన్ నెంబర్ కు ఫోన్ చేశారు. అంతే అక్కడ అసలు కథ స్టార్ట్ అయింది. మేము చెప్పినట్లు చేస్తే మీకు కావలసినంత డబ్బులు ఇస్తామని, మేము చెప్పిన వ్యక్తులకు మీరు శారీరక సుఖం ఇస్తే మీకు ఏం సహాయం చెయ్యాలన్నా చేస్తామని, నగలు, డబ్బులు ఇస్తామని, మీరు సుఖపడటమే కాకుండా విలాసవంతమైన జీవితం గడపడానికి అవకాశం ఉంటుందని ఆ వ్యక్తి కాలేజ్ విద్యార్థినికి చెప్పాడు.

కాలేజ్ విద్యార్థిని తల్లాకుళం పోలీసులకు ఫిర్యాదు చెయ్యడంతో పోలీసు అధికారులు రంగంలోకి దిగారు. ఒక్క ఫోన్ నెంబర్ ఆధారంగా ముగ్గురు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే తల్లాకుళం ప్రాంతంలోని విలాసవంతమైన రెస్టారెంట్ ఉంది. అదే ప్రాంతంలో ప్రముఖ ప్రైవేట్ కాలేజ్, ఓ ప్రముఖ హైస్కూల్స్ ఉన్నాయి. ఇక్కడే ఓ బ్రోకర్ మొబైల్ షాప్ నిర్వహిస్తున్నాడు. కాలేజ్ కు ప్రతిరోజు వచ్చి వెలుతున్న అమ్మాయిల మీద రెస్టారెంట్ నిర్వహకుడు, మొబైల్ షాప్ యజమాని కన్నుపడింది. ఎలాగైనా అమ్మాయిలను లోబరచుకొని హైటెక్ వ్యభిచార కేంద్రం నిర్వహించాలని రెస్టారెంట్ నిర్వహకుడు, సెల్ ఫోన్ షాప్ యజమాని ఆలోచించారు.

ఈ అమ్మాయిలు అప్పుడుప్పుడు మొబైల్ రిపేరు కోసం షాప్ కు వెళ్లి వస్తున్నారు. అదే సమయంలో ఆ అమ్మాయిల మొబైల్ ఫోన్ నెంబర్లు తీసుకున్న ఆ షాప్ యజమాని వారితో పరిచయం పెంచుకున్నాడు. ఆ తర్వాత కాలేజ్ అమ్మాయిల,, హై స్కూల్ అమ్మాయిలకు మాయమాటలు చెప్పి వారిని తల్లాకుళం ప్రాంతంలోని రెస్టారెంట్ కు తీసుకెళ్లి వారికి కావలసిన రుచికరమైన ఆహారం తినిపించారు. అలా అమ్మాయిలను దగ్గర చేసుకున్న మొబైల్ షాప్ యజమాని, రెస్టారెంట్ నిర్వహకుడు తర్వాత వారి అసలు స్వరూపం చూపించారు.

రెస్టారెంట్ లు, విహారయాత్రలకు కాలేజ్, హైస్కూల్స్ అమ్మాయిలను తీసుకెళ్లిన కామాంధులు వారికి చేతి ఖర్చుల కోసం వేల రూపాయాలు ఇవ్వడం మొదలు పెట్టారు. ఆ తర్వాత అమ్మాయిలకు కూల్ డ్రింక్స్ లో డ్రగ్స్, మత్తు మందు కలిపి ఇచ్చి వారిని రహస్య ప్రాంతాల్లో నగ్నంగా చేసి కొందరు యువకులను రెచ్చగొట్టి పోర్న్ వీడియోలు తీశారు. మత్తులో ఉన్న అమ్మాయిలతో పోర్న్ వీడియోలు తీసిన కామాంధులు తర్వాత మేము చెప్పినట్లు వినకపోతే ఈ వీడియోలు సోషల్ మీడియాలో పోస్టు చేస్తామని బ్లాక్ మెయిల్ చేసి బెదిరించి కాలేజ్, హైస్కూల్స్ విద్యార్థినిలతో హైటెక్ వ్యభిచారం చేయించడం స్టార్ట్ చేశారు.

మొత్తానికి అలా కాలేజ్ అమ్మాయిలను లోబరుచుకొని హాస్టల్ లో ఉంటున్న కాలేజ్ పిల్లలనకు నిత్యం మందు, బీర్లు, బిరియానీలు పంపించి వారిని హైటెక్ వ్యభిచార కూపంలోకి దింపారు. కామాంధులు చెప్పినట్లు చెయ్యడానికి నిరాకరించిన కొందరు కాలేజ్ అమ్మాయిలపై కామాంధులు అత్యాచారం చేసి వాటిని మొబైల్ ఫోన్ల,, డిజిటల్ వీడియో కెమెరాల్లో షూట్ చేశారు. కాలేజ్ అమ్మాయిలు, హాస్టల్ లో ఉంటున్న విద్యార్థినిలకు విలాసవంతమైన జీవితం అలవాటు చెయ్యడంతో వారు దిగజారిపోయి హైటెక్ వ్యభిచార కూపంలో చిక్కుపోయారని పోలీసుల విచారణలో వెలుగు చూసింది. గత మూడు సంవత్సరాల నుంచి కాలేజ్ అమ్మాయిలను టార్గెట్ చేసుకుని హైటెక్ వ్యభిచారం చేయిస్తున్నారని పోలీసుల విచారణలో వీరి రహస్యాలు బయటపడ్డాయి. అయితే ఈ లాక్ డౌన్ వేళ మాటిమాటికీ ఈ కాలేజ్ అమ్మాయిలు, హాస్టల్ విద్యార్థినిలు బయటకు వెళ్లి వస్తుండటంతో పోలీసులు ఆరా తీయగా ఈ విషయం వెలుగు చూసింది. తాజాగా నిఘాపెట్టి రైడ్స్ చేసిన పోలీసులకు ముగ్గురు కామాంధులు దొరికిపోయారు. అసలు విషయాలను రాబట్టే పనిలో పోలీసులు దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది.