రామ్ “స్కంద” పై భారీ అంచనాలు…!

Ram Pothineni
Ram Pothineni

టాలీవుడ్ యంగ్ అండ్ ఎనర్జిటిక్ హీరో రామ్ పోతినేని ప్రధాన పాత్రలో, మాస్ యాక్షన్ చిత్రాల దర్శకుడు బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఔట్ అండ్ ఔట్ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ “స్కంద” సెప్టెంబర్ 15, 2023 న వరల్డ్ వైడ్ గా థియేటర్ల లో గ్రాండ్ గా రిలీజ్ కానుంది.

ఈ సినిమా కి సంబందించిన థియేట్రికల్ రైట్స్ మరియు నాన్ థియేట్రికల్ రైట్స్ కు కూడా భారీగా డిమాండ్ పెరిగింది. సినిమా పై ఏ రేంజ్ అంచనాలు నెలకొన్నాయి అనేది బిజినెస్ ను చూస్తుంటే అర్థమవుతుంది.

రామ్ కెరీర్ బెస్ట్ వసూళ్లు కూడా ఈ సినిమా రాబట్టే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ బ్యానర్ పై నిర్మిస్తున్న ఈ చిత్రం లో శ్రీ లీల హీరోయిన్ గా నటిస్తుంది. మ్యూజికల్ సెన్సేషన్ థమన్ సంగీతం అందిస్తున్నారు.