మరదలిపై బావ అత్యాచారం… ఆపై భార్య సపోర్ట్..

దేశంలో కరోనా కరాళ నృత్యం చేస్తున్న ఈ సమయంలో అత్యాచారాలు మాత్రం ఏమాత్రం తగ్గడం లేదు. లాక్ డౌనే విధించి అంతా ఇళ్లకే పరిమితం కావడంతో మనుషులకు ఏం తోచడం లేదు. లాక్ డౌన్ కారణంగా మే 17వ తేదీ వరకు దేశం లాక్ డౌన్ లో ఉంటుంది. లాక్ డౌన్ సమయంలో ఎవరూ బయటకు రావడం లేదు. ఇంటికే పరిమితం అవుతున్న ఈ సమయంలో అక్క ఇంటికొచ్చి అక్కడే ఇరక్కపోయింది చెల్లి. దీంతో ఆ ఇంట్లోనే ఉంటున్న మరదలిపై బావ కన్నుపడింది.

అయితే ఏ విధంగానైనా మరదలిని అనుభవించాలని భావించాడు. దీంతో సమయం కోసం వేచి చూస్తున్నాడు. అనుకున్నట్టుగానే భార్య బయటకు వెళ్ళగానే మరదలిపై కన్నేసిన బావ ఆమెపై ఏదో విధంగా అత్యాచారం చేసేశాడు. దీంతో షాకైన మరదలు, ఆమె అక్క వచ్చిన తర్వాత విషయం చెప్పింది. ఆ విషయం విన్న తర్వాత అక్క తన భర్తకే సపోర్ట్ గా నిలిచింది. తన భర్తకు నువ్వంటే ఇష్టమని.. అందుకే అలా చేసాడని చెప్పింది. దీంతో చెల్లి షాక్ కు గురైంది. వెంటనే అక్కడ నుంచి అంటే ఇంటి నుంచి బయటపడి నేరుగా ఆమె స్థానికుల సహకారంతో పోలీసులకు ఫిర్యాదు చేసింది. కాగా ఈ ఘటన వెస్ట్ బెంగాల్ లోని పురూలియా జిల్లాలో వెలుగుచూసింది. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.