బుల్లి తెరకు సై అంటున్న ఇలియానా

IIeans says Will do television if it gives me good content

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 

టాలీవుడ్‌లో పలువురు స్టార్‌ హీరోల సరసన నటించి మెప్పించి, తమిళంలో కూడా తనకంటూ ఒక ప్రత్యేక స్థానంను దక్కించుకున్న ముద్దుగుమ్మ ఇలియానా బాలీవుడ్‌కు వెళ్లింది. అక్కడ కొంత కాలం పాటు మంచి ఆఫర్లు దక్కించుకుని పలు వంద కోట్ల చిత్రాల్లో హీరోయిన్‌గా నటించి స్టార్‌ ఇమేజ్‌ను సొంతం చేసుకుంది. సౌత్‌ నుండి వెళ్లి ఎక్కువ సక్సెస్‌ను దక్కించుకున్న ఈతరం హీరోయిన్‌గా ఇలియానా పేరు సంపాదించింది. అయితే అవకాశాలు అన్ని రోజులు రావు. బాలీవుడ్‌లో ఇలియానాకు అవకాశాలు మెల్ల మెల్లగా తగ్గుతూ వచ్చాయి. గత కొంత కాలంగా ఈమెకు అసలు అవకాశాలే లేకుండా పోయాయి.

బాలీవుడ్‌లో అవకాశాలు రాకపోవడంతో సౌత్‌కు వచ్చేందుకు ప్రయత్నించినా కూడా సాధ్యం కాలేదు. స్టార్‌ హీరోల చిత్రాల్లో నటించాలని భావించినా కూడా అది సాధ్యం కాలేదు. దాంతో హిందీలోనే కొనసాగాలని ప్రయత్నాలు చేస్తోంది. ఆ మద్య బాయ్‌ ఫ్రెండ్‌ను పెళ్లి చేసుకోబోతున్నట్లుగా వార్తలు వచ్చాయి. ఆ వార్తలపై స్పష్టత రాలేదు. ఇక బాలీవుడ్‌లో అవకాశాలు లేక పోవడంతో ఈమె బుల్లి తెరపై కనిపించేందుకు ఓకే చెప్పేసింది.

ఇటీవల ఈమె మీడియాతో మాట్లాడుతూ బుల్లి తెరకు ఇప్పుడు మంచి డిమాండ్‌ ఉంది. మంచి కాన్సెప్ట్‌తో వస్తే తప్పకుండా టెలివిజన్‌లో నటించేందుకు తనకు ఎలాంటి అభ్యంతరం లేదు అంటూ ప్రకటించేసింది. అంటే బుల్లి తెరపై కనిపించడం ఇలియానాకు ఓకే అని తేలిపోయింది. వెండి తెరపై అవకాశాలు రానప్పుడు బుల్లి తెరపై అయినా కనిపించాలని ఇలియానా ఈ నిర్ణయం తీసుకుంది.