మీరు చెప్తే చేయను… నేను అనుకుంటేనే చేస్తా : శృతిహాసన్

విశ్వనటుడు క‌మ‌ల్ హాసన్ గారాల ప‌ట్టి శృతి హాస‌న్. చాలా ముక్కుసూటిగా వ్యవహరిస్తుంటుంది. సోష‌ల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉండే ఈ అమ్మ‌డు తాజాగా నెటిజ‌న్స్‌తో కాసేపు ముచ్చ‌టించింది. దీంతో నెటిజ‌న్స్‌.. ఖాళీగా ఇంట్లో ఉండ‌క‌పోతే బ‌య‌ట‌కి వెళ్లి స‌మాజ సేవ చేయ‌వ‌చ్చు క‌దా… అంటూ ఆమెను ప్రశ్నించడమే కాకుండా అన్నట్లు.. క‌రోనా రిలీఫ్ ఫండ్‌కి ఇంతవ‌ర‌కు విరాళం ఎందుకు ఇవ్వ‌లేదు అని ప‌లు ప్ర‌శ్న‌లు సంధించారు ఫ్యాన్స్.

ఈ విషయంపై శృతి త‌న‌దైన శైలిలో స్పందించింది. క‌రోనా సంక్షోభంలో ప్ర‌జ‌ల‌కి సేవ ఎందుకు చేయ‌డం లేద‌ని కొంద‌రు నాపై కామెంట్స్ గుప్పిస్తున్నారు. అయితే తనను సేవ చేయ‌మ‌ని అడిగేవారు ఎంత సేవ చేస్తున్నారో తనకు తెలియదు గానీ.. కేంద్ర‌, రాష్ట్ర ప్ర‌భుత్వాలు మ‌న‌ల్ని ఇంట్లో ఉండ‌మ‌ని ఆదేశాలు ఇచ్చిన విష‌యాలు మ‌ర‌చి పోకండి. అంటూ వివరించారు. అలాగే.. విరాళం విష‌యానికి వ‌స్తే.. గ‌తంలో తాను సాయం చేసిన సంద‌ర్భాలు చాలా ఉన్నాయని.. ఎవ‌రో చెర్తే… తాను సహాయం చేయనని.. తాను ఇవ్వాలని భావిస్తేనే చేస్తానని స్పష్టం చేసింది అమ్మడు. అంతేకాకుండా ఇత‌ర‌కుల‌కి ఎంత సాయం చేస్తే… దేవుడు అంత రిట‌ర్న్ ఇస్తాడు అని న‌మ్మే వ్య‌క్తిని తాను అని కూడా చెప్పుకొచ్చింది శృతి హాస‌న్ భామ.