చెస్‌ ప్రపంచకప్‌ ఫైనల్లో ఇండియన్ స్టార్ ప్లేయర్ ప్రజ్ఞానంద.. !

Indian star player Pragyananda in the final of Chess World Cup.. !
Indian star player Pragyananda in the final of Chess World Cup.. !

ఇండియన్ యంగ్ చెస్ ఛాంపియన్ హిస్టరీ క్రియేట్ చేశాడు.ప్రపంచకప్‌ ఫైనల్లో అడుగుపెట్టిన దిగ్గజం విశ్వనాథన్‌ ఆనంద్‌ తర్వాత రెండో భారత ఆటగాడిగా నిలిచాడు. సెమీస్‌లో ప్రపంచ మూడో ర్యాంకు ఆటగాడు ఫాబియానో కరువానాపై ప్రజ్ఞానంద గెలిచాడు.. చివరి పోరులో ప్రపంచ నంబర్‌వన్‌ మాగ్నస్‌ కార్ల్‌సన్‌తో తాడోపేడో తేల్చుకోనున్నాడు.

హోరాహోరీగా సాగిన సెమీస్‌లో మొదటి నుంచి అగ్రశ్రేణి ఆటగాడైన అమెరికా గ్రాండ్‌మాస్టర్‌ కరువానాకు ప్రజ్ఞానంద గట్టి పోటీనిచ్చిన 18 ఏళ్ల కుర్రాడు .. పట్టు వదలకుండా టైబ్రేక్‌లోనూ పోరాడాడు. సోమవారం రోజున టైబ్రేక్‌లో భాగంగా జరిగిన తొలి రెండు ర్యాపిడ్‌ గేమ్‌లు కూడా డ్రా అయ్యాయి. రసవత్తరంగా సాగిన గేమ్‌లో ప్రజ్ఞానంద 3.5-2.5 తేడాతో కరువానాపై నెగ్గాడు. ఈ విజయంతో 2024 క్యాండిడేట్‌ టోర్నీలో ప్రజ్ఞానంద చోటు ఖాయం చేసుకున్నాడు..కార్ల్‌సన్‌ ,బాబి ఫిషర్‌ తర్వాత ఆ పోటీల్లో తలపడే మూడో పిన్న వయస్సు ఆటగాడిగా నిలిచాడు

‘‘ప్రజ్ఞానంద ఫైనల్‌ చేరాడు. టైబ్రేక్‌లో కరువానాను ఓడించాడు. ఇక కార్ల్‌సన్‌తో తలపడనున్నాడు. ఆహా.. ప్రజ్ఞానందది ఎంత గొప్ప ప్రదర్శన’’ అని ఆనంద్‌ ట్వీట్‌ చేశాడు. కార్ల్‌సన్‌తో టైటిల్‌ పోరులో భాగంగా మంగళవారం తొలి గేమ్‌ జరుగుతుంది.