“జైలర్ 2” పై ఇంట్రెస్టింగ్ న్యూస్ .!

Rajinikanth Jailer -2 Movie
Cinema News

కోలీవుడ్ తలైవర్ సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా నటించిన రీసెంట్ సెన్సేషనల్ హిట్ మూవీ “జైలర్” కోసం అందరికీ తెలిసిందే. మరి దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్ తెరకెక్కించిన ఈ మూవీ రజినీకాంత్ కెరీర్ లోనే రెండో అతి పెద్ద హిట్ గా నిలవగా ఈ మూవీ కి సీక్వెల్ కూడా ఉందని వచ్చిన వార్తలు మరింత హైప్ ను తీసుకొచ్చాయి. అయితే ఈ మూవీ పై ఇప్పుడు లేటెస్ట్ అప్డేట్ తెలుస్తుంది.

Rajinikanth Jailer-2 Movie
Jailer-2 Movie

జైలర్ 1 లో చిన్న పాత్ర చేసిన యంగ్ నటి మిర్న పార్ట్ 2 కోసం మాట్లాడుతూ తాను రీసెంట్ గా దర్శకుడు నెల్సన్ తో మాట్లాడానని అయితే తాను ప్రస్తుతం జైలర్ 2 స్క్రిప్ట్ ని డెవలప్ చేసే పనిలో ఉన్నారని తెలిపింది. అలాగే పార్ట్ 2 లో తాను ఉందో లేదో అనేది మాత్రం కంప్లీట్ గా దర్శకుని చేతిలోనే ఉందని ఆమె తెలియజేసింది. ఇక ఈ సాలిడ్ హిట్ మూవీ లో శివ రాజ్ కుమార్ మరియు మోహన్ లాల్ లు నటించగా అనిరుద్ సంగీతం అందించాడు. అలాగే సన్ పిక్చర్స్ వారు నిర్మాణం వహించారు.