Jailer 2: తెలుగు రాష్ట్రాల్లో ‘జైలర్ 2’ సంచలనం.. రూ.100 కోట్ల మార్క్ దాటిందా?

తెలుగు రాష్ట్రాల్లో ‘జైలర్ 2’ సంచలనం.. రూ.100 కోట్ల మార్క్ దాటిందా?
తెలుగు రాష్ట్రాల్లో ‘జైలర్ 2’ సంచలనం.. రూ.100 కోట్ల మార్క్ దాటిందా?

సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా, దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్ తెరకెక్కించిన క్రేజీ సీక్వెల్ ‘జైలర్ 2’ Jailer 2 భారీ అంచనాల నడుమ ప్రేక్షకుల ముందుకు వచ్చి బాక్సాఫీస్ వద్ద సందడి చేస్తోంది. మొదటి భాగం విజయంతో ఈ సినిమాపై కూడా భారీ హైప్ ఏర్పడింది. దీంతో ఈసారి సినిమా ప్రపంచవ్యాప్తంగా రూ.1000 కోట్ల మార్క్‌ను అందుకుంటుందని అభిమానులు ఆశించారు. అయితే ప్రస్తుత ట్రేడ్ అంచనాల ప్రకారం ఆ లక్ష్యానికి కొంత దూరంలోనే నిలిచే అవకాశాలు కనిపిస్తున్నాయి.

తెలుగు రాష్ట్రాల్లో రూ.100 కోట్ల వసూళ్ల టాక్!

దక్షిణాది రాష్ట్రాల్లో ‘జైలర్ 2’ మంచి వసూళ్లను సాధిస్తున్నట్లు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మార్కెట్లలో సినిమా అంచనాలకు మించి రాణిస్తోందనే టాక్ వినిపిస్తోంది.

తాజా ట్రేడ్ సమాచారం ప్రకారం, తెలుగు రాష్ట్రాల నుంచే ఈ సినిమా రూ.100 కోట్ల వసూళ్ల మార్క్‌ను దాటినట్లు ప్రచారం జరుగుతోంది. ఇదే నిజమైతే, తెలుగు ప్రేక్షకుల్లో రజినీకాంత్‌కు ఉన్న క్రేజ్ మరోసారి స్పష్టమైనట్లే.

తెలుగు మార్కెట్‌లో రజినీ సత్తా!

కోలీవుడ్ నుంచి వచ్చిన ఓ సినిమాకు తెలుగు రాష్ట్రాల్లో ఈ స్థాయి వసూళ్లు రావడం విశేషంగా చెప్పుకోవచ్చు. రజినీకాంత్ తనదైన స్టార్డమ్‌తో మరోసారి తెలుగు బాక్సాఫీస్ వద్ద ప్రభావం చూపిస్తున్నారని అభిమానులు అభిప్రాయపడుతున్నారు.

ఈ చిత్రానికి అనిరుధ్ రవిచందర్ సంగీతం అందించగా, సన్ పిక్చర్స్ నిర్మాణం చేపట్టింది. మరి సినిమా తుది వసూళ్లు ఎంతవరకు చేరుకుంటాయో చూడాలి.