‘బిగ్‌బాస్‌’ సీజన్‌ 2.. ఆసక్తికర అప్‌డేట్‌

Interesting News On Jr.NTR's Bigg Boss season2

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 

ప్రపంచ వ్యాప్తంగా అత్యంత ప్రజాధరణ ఉన్న బిగ్‌బాస్‌కు హిందీలో గత పది సంవత్సరాలుగా ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్న విషయం తెల్సిందే. తెలుగులో కూడా ఇటీవలే ఈ రియాల్టీ షో ప్రారంభం అయ్యింది. ఎన్టీఆర్‌ హోస్ట్‌గా వ్యవహరించిన బిగ్‌బాస్‌ సీజన్‌ 1 సూపర్‌ హిట్‌ అయ్యింది. ఇప్పుడు సీజన్‌ 2కు సంబంధించిన ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. బిగ్‌బాస్‌ తెలుగులో భారీ విజయాన్ని సొంతం చేసుకున్న నేపథ్యంలో సీజన్‌ 2 కోసం మరింతగా స్టార్‌ మా వారు కసరత్తు నిర్వహిస్తున్నారు. మొదటి సీజన్‌లో కొంత మంది సెలబ్రెటీల విషయంలో విమర్శలు వచ్చాయి. అందుకే ఈ సారి సెలబ్రెటీల ఎంపిక విషయంలో కసరత్తు జరుగుతుంది.

రెండవ సీజన్‌కు కూడా ఎన్టీఆర్‌ హోస్ట్‌గా చేయడం దాదాపు ఖరారు అయ్యింది. రాజమౌళితో చిత్రం మొదలు పెట్టక ముందే బిగ్‌బాస్‌ సీజన్‌ 2ను చేయాలని ఎన్టీఆర్‌ భావిస్తున్నాడు. మా వారు కూడా అందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. మొదటి సీజన్‌లో పది వారాలు అంటే 70 రోజుల పాటు సాగిన బిగ్‌బాస్‌ రెండవ సీజన్‌ నుండి 14 వారాల పాటు కొనసాగించే యోచనలో ఉన్నారు. తమిళ బిగ్‌బాస్‌ మొదటి సీజన్‌ను 14 వారాల పాటు కొనసాగించారు. తమిళంలో మంచి ప్రేక్షకాధరణ దక్కింది. అందుకే తెలుగులో కూడా ఎక్కువ ఎపిసోడ్‌లను ప్లాన్‌ చేయాలని నిర్వాహకులు భావిస్తున్నారు. అతి త్వరలోనే సెలబ్రెటీల ఎంపిక మొదలయ్యే అవకాశం ఉందని, సెలబ్రెటీల సంఖ్యలో కూడా కాస్త మార్పు ఉండే అవకాశం ఉందని, గేమ్‌లో చిన్న చిన్న మార్పులు చేర్పులు కూడా ఉండేలా చూస్తున్నారు. మొదటి సీజన్‌ మాదిరిగానే రెండవ సీజన్‌ను కూడా పుణెలోనే నిర్వహించనున్నారు.