ఆమెకి ఐరన్ లెగ్ ముద్ర

అగ్ర హీరోలతో నటించిన హీరోయిన్లు మాములుగా అంత వేగంగా తెరమరుగు ఎవరు. కానీ అందాల భామ అను ఇమాన్యుయేల్ కి మాత్రం అదృష్టం కలిసి రాలేదు. పవన్ కళ్యాణ్ తో అజ్ఞ్యాతవాసి చేసినా, నా పేరు సూర్యలో అల్లు అర్జున్ తో నటించినా అనుకి లక్ వర్కౌట్ అవలేదు. శైలజ రెడ్డి అల్లుడు కూడా ప్లాప్ అవడంతో ఇక ఆమెకి ఐరన్ లెగ్ ముద్ర వేసేసి పక్కన పెట్టేసారు.

ఈ గ్యాప్ లో స్లిమ్ అయి మునుపటి కంటే చాల గ్లామరస్ గా కనిపిస్తున్న అనుకి పెద్ద హీరోల సినిమాల్లో అయితే ఛాన్సులు రావడం లేదు. ఇప్పుడామె అల్లు అర్జున్ తమ్ముడు శిరీష్ సరసన ఒక చిత్రంలో నటించనుంది. అవడానికి మెగా హీరోల్లో ఒకడైనా కానీ శిరీష్ కి మార్కెట్ లేదు. మిడ్ రేంజ్ హీరోల కంటే తక్కువ, అయిదు కోట్ల మార్కెట్ ఉన్న హీరోల కంటే ఎక్కువ అన్నట్టుంటాడు. సో టాప్ హీరోలతో నటించిన అను లెవల్ బాగా పడినట్టే.