ఏఎన్ఆర్ కి ఇటువంటి పిచ్చి వుందా..? తెలిస్తే ఆశ్చర్యపోతారు..!

ఏఎన్ఆర్ కి ఇటువంటి పిచ్చి వుందా..? తెలిస్తే ఆశ్చర్యపోతారు..!
Latest News

అక్కినేని నాగేశ్వరావు గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. ఆయన ఎన్నో సినిమాల్లో నటించి మంచి పేరు తెచ్చుకున్నారు. సినిమాలు మీద ఇంట్రెస్ట్ తోనే ఆయన ఇండస్ట్రీలోకి వచ్చారు. తర్వాత ఎన్నో మూవీ ల్లో నటించి ఎంతో మంది అభిమానుల్ని సంపాదించుకున్నారు. ఆయన అద్భుతమైన నటనతో దాదాపు 75 సంవత్సరాలు పాటు ఇండస్ట్రీలో నే ఉన్నారు. ఇది ఇలా ఉంటే తాజాగా ఆయన శత జయంతి వేడుకలని చాలా ఘనంగా జరిపారు.

అన్నపూర్ణ స్టూడియోస్ అంటే నాగేశ్వరరావు గారికి ఇష్టమని అక్కడే ఆయన విగ్రహాన్ని ప్రతిష్టింపజేశారు. శతజయంతి వేడుకలలో నాగేశ్వరరావు గారికి సంబంధించిన విషయాలని చాలా మాట్లాడారు. నాగేశ్వరావు గారికి కొయ్యి బొమ్మలు అంటే అమితమైన ప్రాణం అందుకని ఆయన కొయ్య బొమ్మలను ఎక్కువగా తెచ్చుకుని వచ్చి ఇంట్లో అలంకరించే వారంట . నాగేశ్వరరావు కొన్న కొయ్యి బొమ్మలు ఇప్పటికీ ఆయన గదిలో భద్రంగా ఉన్నాయి ఆయన దగ్గర డబ్బులు లేకపోయినా వున్న డబ్బులతో కొయ్యబొమ్మలకి ఖర్చు చేసే వారట ఆయన భార్య అన్నపూర్ణ కి కూడా కొయ్యి బొమ్మలు అంటే చాలా ఇష్టం.