ఏఎన్నార్ గురించి మోహన్ బాబు వ్యాఖ్యలు వింటే ఆశ్చర్యపోవడం పక్కా..!

ఏఎన్నార్ గురించి మోహన్ బాబు వ్యాఖ్యలు వింటే ఆశ్చర్యపోవడం పక్కా..!
Latest News

టాలీవుడ్ సీనియర్ నటుడు అక్కినేని నాగేశ్వరరావు శతజయంతి వేడుకలు తాజాగా ఘనంగా జరిగిన విషయం మనకి తెలిసిందే. ఈ వేడుకలకు టాలీవుడ్ కి చెందిన పలువురు సినీ ప్రముఖులు కూడా హాజరయ్యారు. ఈ వేడుకలకు కలెక్షన్ కింగ్ మోహన్ బాబు కూడా హాజరయ్యారు. స్టూడియోలో ఏర్పాటు చేసిన ఏఎన్నార్ విగ్రహానికి నివాళులర్పించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. నాగేశ్వరరావు గారితో తనకున్న అనుభవాలను జ్ఞాపకాలను పంచుకున్నారు.

ఏఎన్నార్ గురించి మోహన్ బాబు వ్యాఖ్యలు వింటే ఆశ్చర్యపోవడం పక్కా..!
Mohan Babu

ముఖ్యంగా అక్కినేని నాగేశ్వరరావు గురించి మాట్లాడాలంటే.. “నేను ఓ పెద్ద పుస్తకాన్నే రాయొచ్చని తెలిపారు మోహన్ బాబు. మా ఇద్దరికీ ఉన్నటువంటి బంధం అలాంటిది మరీ. నేను తిరుపతిలో చదువుకునే సమయంలో నాగేశ్వరరావు గారి సినిమా 100 రోజుల ఫంక్షన్ జరుగుతుందంటే అక్కడికి వెళ్లి ఆయనను చూద్దామని ప్రయత్నించి చొక్కా చించుకొని రూమ్ కి వెళ్లిన వాడిని. మళ్లీ ఆ చొక్కా కుట్టించుకోవడానికి కూడా నా వద్ద డబ్బులు ఉండేవి కాదు . అలాంటి నాగేశ్వరరావు గారితో సినిమా పరిశ్రమలో అసిస్టెంట్ డైరెక్టర్ గా పని చేసే అవకాశం నాకు దక్కింది. నాగేశ్వరరావు, ఎస్వీ రంగారావు, పని చేసిన మరపురాని మనిషి మూవీ కు నేను అసోసియేట్ గా పని చేశాను” అని చెప్పుకొచ్చారు.

ప్రధానంగా ఒక సందర్భం గురించి మాట్లాడుతూ.. “అన్నపూర్ణ స్టూడియోలోనే మూవీ చేస్తున్నప్పుడు నా కంటే ముందుగా నాగేశ్వరరావు సెట్ కి వెళ్లి కూర్చున్నారు.నేను లేటుగా వెళ్లాను. నమస్కారం సార్ అన్నాను. ఏంటయ్యా అలా ఉన్నావు అన్నారు. నాకొక కోరిక ఉంది సార్ అన్నాను. దాసరి నారాయణ రావు లోపల ఉన్నారు. మీరేమో బయట ఉన్నారు. ప్రతిసారి మీరు వస్తే నేను లేచి నిలబడాలా? నేను వస్తే మీరు లేచి నిలబడాలని కోరిక కోరుకుంటున్నాను సర్ అని అన్నాను. అమ్మ లమ్మిడి కొడక నీకు అంత కోరిక ఉందా రా అన్నారు. మరుసటి రోజు ఇదే ఫస్ట్ ఫ్లోర్ లో నాగేశ్వరరావుగారు, దాసరినారాయణగారు బయట ఉన్నారు. నేను మేకప్ వేసుకొని వెళ్లాను. ఇద్దరూ లేచి నిలబడ్డారు. ఇదేంటి సార్.. ఇద్దరూ లేచి నిలబడ్డారు అని అడిగాను. లేదులే.. నీ కోరిక కదా.. అందుకే మేమిద్దరం లేచి నిలబడ్డాం అని అన్నారు. అలాంటి చమత్కారాలు నాగేశ్వరరావు గారిలో చాలా ఉన్నాయి” అని మోహన్ బాబు నవ్వుతూ వెల్లడించారు.