మరో ‘కబాలి’లా ఉందే!

Is Kaala Looks Like Kabali Movie

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

రజినీకాంత్‌, రంజిత్‌ పాల కాంబినేషన్‌లో గతంలో వచ్చిన ‘కబాలి’ చిత్రం అట్టర్‌ ఫ్లాప్‌ అయిన విషయం తెల్సిందే. ఆ సినిమా కథ సాదారణ ప్రేక్షకులకు అర్థం కాకుండా, ఏదో గందరగోళంగా స్క్రీన్‌ప్లే సాగింది. అయినా కూడా దర్శకుడు రంజిత్‌పాపై నమ్మకంతో రజినీకాంత్‌ మరోసినిమాను ఆయన దర్శకత్వంలో చేశాడు. ధనుష్‌ నిర్మించిన ‘కాలా’ వారిద్దరి కాంబో మూవీనే. రజినీకాంత్‌, రంజిత్‌పాల కాంబినేషన్‌లో తెరకెక్కిన ‘కాలా’ చిత్రం విడుదల వాయిదాల మీద వాయిదాలు పడుతూ ఎట్టకేలకు విడుదలకు సిద్దం అయ్యింది. తాజాగా ఈ చిత్రం ట్రైలర్‌ను ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చారు.

‘కబాలి’లో మాదిరిగానే ఈ చిత్రంలో కూడా రజినీకాంత్‌ గ్యాంగ్‌స్టర్‌గా కనిపించబోతున్నాడు. ట్రైర్‌ చూస్తుంటే ‘కబాలి’ చిత్రాన్ని మళ్లీ చూస్తున్నట్లుగా అనిపిస్తుంది. ‘కబాలి’లో డిలీట్‌ చేసిన సీన్స్‌ను మళ్లీ సినిమాగా విడుదల చేస్తున్నారా ఏంటీ అనే అనుమానం కుగుతుంది. కబాలి సినిమా ఫ్లాప్‌ అయినా కూడా రంజిత్‌కు రజినీకాంత్‌ అవకాశం ఇవ్వడంను చాలా మంది తప్పుబడుతున్నారు. అయితే వారి అంచనాలను తారు మారు చేస్తూ ఖచ్చితంగా ‘కాలా’ చిత్రాన్ని సక్సెస్‌ చేసుకుంటానంటూ రంజిత్‌ పా ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు. కాని సిననిమా ట్రైలర్‌ చూస్తుంటే మాత్రం మళ్లీ ‘కబాలి’నే తెరకెక్కించినట్లుగా అనిపిస్తుంది. సినిమావిడుదలైతే కాని అసలు విషయంపై క్లారిటీ రానుంది. ఈ చిత్రం సునాయసంగా 300 కోట్లను వసూళ్లు చేస్తుందనే నమ్మకంను సినీ వర్గాల వారు కలిగి ఉన్నారు. మరి వారి అంచనాలను అందుకుంటుందా అనేది చూడాలి.